ఇంట్లో ఉపకరణాలను బట్టి, అవి వాడుకునే విద్యుత్‌ను బట్టి కరెంటు బిల్లులు వస్తుంటాయి. అయితే కొందరు మాత్రం ఉపకరణాలు తక్కువగానే ఉన్నా బిల్లు ఎక్కువ వస్తుందని ఆందోళన చెందుతుంటారు. కానీ కొన్ని సూచనలు పాటిస్తే కరెంటు బిల్లు ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
* సోలార్ పవర్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ ఒకసారి పెట్టించుకుంటే కనీసం 20-25 ఏళ్ల వరకు ఢోకా ఉండదు. అన్నేళ్లకు అయ్యే కరెంటు ఖర్చుతో పోలిస్తే సోలార్ పవర్ తక్కువే అవుతుంది. కనుక సోలార్ పవర్ ను ఏర్పాటు చేసుకుంటే కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందవచ్చు.
* గీజర్, వాటర్ ట్యాంక్ మోటార్ లాంటి వాటి స్విచ్ లు వేసి మర్చిపోతుంటారు. దీంతో ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతుంది. కనుక వాటితో పని అయిపోగానే స్విచ్‌లను ఆఫ్ చేయాలి. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది. బిల్లు తక్కువ వస్తుంది.
* కొందరు ఇంట్లో అవసరం ఉన్నా లేకున్నా విద్యుత్ ఉపకరణాలను ఆన్‌లోనే ఉంచుతారు. ఉదాహరణకు ఫ్యాన్లు, లైట్లు, టీవీ లాంటివి. అవసరం ఉంటేనే వాటిని వేయండి. లేకపోతే ఆఫ్ చేయండి. దీంతో బిల్లును తగ్గించుకోవచ్చు.
* కరెంటు బిల్లును చెల్లించడంలో కొందరు 1, 2 రోజులు ఆలస్యం చేస్తుంటారు. అయితే ఇలా ఆలస్యం చేస్తే అనవసరంగా ఫైన్ కట్టాల్సి వస్తుంది. కనుక డ్యూ డేట్ లోపల బిల్లును చెల్లించే ప్రయత్నం చేయండి. దీంతో మరుసటి బిల్లు తక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
* ఫ్రిజ్ వల్ల ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. కనుక దాన్ని ఉష్ణోగ్రతను నియంత్రించాలి. ఇంట్లో చల్లగా ఉండే చోట ఫ్రిజ్‌ను పెట్టాలి. దీంతో కంప్రెసర్‌పై పడే భారం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్ తక్కువ ఖర్చు అవుతుంది. బిల్లు తక్కువగా వస్తుంది.
* డెస్క్ టాప్ కంప్యూటర్‌ను వాడడం వల్ల కూడా విద్యుత్ ఎక్కువగా ఖర్చవుతుంది. మీకు డెస్క్ టాప్, ల్యాప్‌టాప్ రెండూ ఉంటే.. ల్యాప్‌టాప్‌ను వాడడమే ఉత్తమం. దీంతో విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. బిల్లును తగ్గించుకోవచ్చు.
* కొన్ని ఉపకరణాలకు గాను వైర్ ప్లగ్‌లను సాకెట్‌లో పెట్టాలి. అయితే వాటిని వాడనప్పుడు సాకెట్‌లోంచి తీసేయండి. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది.
* ఏసీలు ఉన్నవారు ఉష్ణోగ్రత సెట్టింగ్‌ను 24-25 డిగ్రీల వద్ద పెడితే విద్యుత్ ఎంతో ఆదా అవుతుంది.
* మీ ఇంట్లో ఉండే విద్యుత్ ఉపకరణాలైన ఫ్రిజ్, ఏసీ లాంటివి కనీసం 4 స్టార్ రేటింగ్ ఉండేవి అయితే బెటర్. వాటితో విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. 4 స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలను కొనుగోలు చేసి వాడండి. విద్యుత్ వాడకం తగ్గుతుంది. బిల్లు కూడా తగ్గుతుంది.
* ఇంట్లో ఉన్న బల్బులన్నింటినీ ఎల్ఈడీకి మార్చండి. దీంతో విద్యుత్ తక్కువ ఖర్చు అవుతుంది.
* ఇంట్లో ఉండే ఫ్యాన్లు కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ ఉన్నవి వాడండి. విద్యుత్‌ను ఆదా చేయవచ్చు.
ఇలా సూచనలు పాటించడం వల్ల మీకు నెల నెలా వచ్చే విద్యుత్ బిల్లులో కచ్చితంగా తగ్గుదల కనిపిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…