అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ అనేక పథకాలను ఏపీలో అమలు చేస్తున్నారు. వాటిల్లో నేతన్న నేస్తం పథకం కూడా ఒకటి. దీని ద్వారా చేనేతపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే 81వేల మందికి పైగా రూ.383 కోట్లను అందించారు. దీంతో చేనేత కార్మికుల బతుకులు బాగుపడుతున్నాయి.
వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఎంతో మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు సీఎం జగన్‌ను తలచుకుంటున్నారు. వైఎస్సార్ లాగే ఆయన తనయుడు కూడా ప్రజల మన్ననలు పొందుతున్నారని చేనేత కార్మికులు అంటున్నారు.
వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఇప్పటికే 2 సార్లు సహాయం అందించారు. ఇక మూడో సారి కూడా సహాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలనే ఒక్కొక్క కార్మికుడికి రూ.24 వేల చొప్పున సహాయం అందించనున్నారు. అలాగే కోవిడ్ వల్ల చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి అనేక వినూత్న ప్రయోగాలతో చేనేత రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆప్కో ద్వారా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ను పొగుడుతూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…