Anchor Vishnu Priya : తెలుగు బుల్లితెరపై యాంకర్ గా అందరికీ విష్ణుప్రియ ఎంతో సుపరిచితురాలు. బుల్లితెరపై ప్రసారమైన పోవే పోరా అనే కార్యక్రమం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె తన యాంకరింగ్ ద్వారా అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈమె బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానం కొనసాగించక ముందు ఒక మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి అతి చిన్న వయసులోనే వెండితెరపై సందడి చేసింది. అయితే బుల్లితెర యాంకర్ గా పలు కార్యక్రమాలను చేసిన విష్ణుప్రియ విశేష ప్రేక్షకాదరణను దక్కించుకుంది.
గత కొన్ని రోజులుగా విష్ణుప్రియ పూర్తిగా బుల్లితెరకు వెండితెరకు దూరమైంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిత్యం తన ఫోటోలను, అద్భుతమైన వీడియోలను షేర్ చేస్తూ అభిమానుల సందడి చేస్తోంది.
https://www.instagram.com/reel/CV45EzbhuA9/?utm_source=ig_web_copy_link
విష్ణు ప్రియ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో విష్ణు ప్రియ ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తున్న విధానాన్ని చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.