Anchor Suma : రాజీవ్ క‌న‌కాల‌తో విడాకులు.. సుమ ఏం చెప్పిందంటే..?

Anchor Suma : ప్రముఖ యాంకర్ సుమ.. ఎక్క‌డ ఉన్నా కూడా అక్క‌డ సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. వేదిక ఏదైనా స‌రే సుమ ఉందంటే అక్క‌డ న‌వ్వుల సునామీ వ‌స్తుంది. గత 15 ఏండ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా.. స్టేజ్‌పై హడావుడి అంతా సుమదే. సుమ రెమ్యునరేషన్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కో ఈవెంట్ కోసం కనీసం రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టీవీలో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం కనీసం లక్ష రూపాయలకు పైనే రెమ్యునరేషన్ అందుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Anchor Suma

ఇక బుల్లితెర‌పై రాణిస్తున్న సుమ సినిమాల్లో న‌టించి చాలా కాల‌మే అయింది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా జయమ్మ పంచాయతీ పేరుతో వెండితెరపై మ‌ళ్లీ కనిపించనుంది. సుమ ప్రధాన పాత్రలో వస్తున్న జయమ్మ పంచాయతీ చిత్రాన్ని కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు తెరకెక్కిస్తున్నాడు. మే 6న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో.. సినిమా టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. తాజాగా ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. ఈ క్ర‌మంలో సుమ‌క్క అంటూ టైటిల్ సాంగ్ వేశారు. ఇక ఆలీతో త‌న ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు పంచుకుంది సుమ‌. ఈ క్ర‌మంలోనే త‌న భ‌ర్త‌తో రాజీవ్ క‌న‌కాల‌తో జ‌రిగిన గొడ‌వ‌ల‌పై స్పందించింది.

రాజీవ్‌, సుమ విడిపోయారంటూ గతంలో వార్త‌లు వ‌చ్చాయి. దానిపై స్పంద‌న ఏంట‌ని అడ‌గ‌గా, త‌నకు, రాజీవ్ కు మధ్య ఈ 23 ఏళ్ల కాలంలో ఎన్నో సార్లు గొడవలు జరిగాయని చెప్పింది. అయితే.. భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం చాలా సులువని.. తల్లిదండ్రులుగా విడాకులు తీసుకోవడం మాత్రం చాలా కష్టమని తెలిపింది. ఈ విషయాన్ని చెబుతూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఇక తనకు సినిమాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని.. అయితే, ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతోనే ఇంతకాలం ఆగానని తెలిపింది. చివరకు జయమ్మ పంచాయతీ సినిమా వచ్చిందని చెప్పింది. తన పూర్తిపేరు పల్లెశెన పాచిమిట్టిన సుమ అని పేర్కొంది. తెలుగు సినిమాల్లో పంచాయితీ పెద్దగా నటించిన ఐదుగురు హీరోల పేర్లు చెప్పమనగానే సుమ తడుముకోకుండా రజనీకాంత్‌, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, సంపూర్ణేశ్‌బాబు అని ఠ‌పీమని చెప్పింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM