Anchor Suma Son : తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలు, సినిమా ఈవెంట్ లతో ఎంతో బిజీగా ఉంది. ఇలా కెరీర్లో ఎంతో బిజీగా ఉండే సుమ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక తన సినిమా జయమ్మ పంచాయతీ గురించి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్ చేస్తుంటుంది. అలాగే సుమ తన ఇంటికి సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకున్నప్పటికీ ఎప్పుడూ తన పిల్లల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించలేదు. అయితే సుమకు ఇద్దరు పిల్లలనే సంగతి మనకు తెలిసిందే. తన కొడుకు రోషన్ ను హీరోగా వెండితెరకు పరిచయం చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది రోషన్ హీరోగా సుమ సొంత నిర్మాణంలో సినిమా చేయాలని పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా తాజాగా సుమ కొడుకు రోషన్ పుట్టినరోజు కావడంతో సుమ సోషల్ మీడియా వేదికగా తన కొడుకు రోషన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తన కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే సుమ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఆమె కొడుకు రోషన్ ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు. అసలేంటి రోషన్ ఇలా మారిపోయాడు.. గుర్తు పట్టలేకుండా ఉన్నాడు.. అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఎంతో పొడవుగా క్యాజువల్ లుక్ లో ఉన్న రోషన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.