Sreemukhi : బుల్లితెర యాంకర్లలో మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో యాంకర్ సుమ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే సుమ తరువాత ఆ రేంజ్‌లో పాపులర్ అయిన యాంకర్ ఎవరు.. అంటే.. మనకు గుర్తుకు వచ్చేది శ్రీముఖినే అని చెప్పవచ్చు. యాంకర్ సుమ లాగే శ్రీముఖి కూడా బాగా మాట్లాడగలదు. ఈవెంట్ లేదా షో, ప్రోగ్రామ్ ఏదైనా సరే.. సుమ లాగే శ్రీముఖి సందడి చేస్తుంటుంది. ముఖ్యంగా శ్రీముఖి యువతకు బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికే పలు షోల ద్వారా శ్రీముఖి యూత్‌లో ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. అయితే రెమ్యునరేషన్ విషయంలోనూ సుమకు పోటీగా శ్రీముఖి వస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.
యాంకర్ సుమ ఒక్క కాల్‌షీట్‌కు రూ.5 లక్షలు తీసుకుంటుండగా.. ఆమె తరువాత రెండో స్థానంలో శ్రీముఖి నిలిచిందని చెప్పవచ్చు. శ్రీముఖి ఒక్క కాల్‌షీట్‌కు రూ.3 లక్షల వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం. శ్రీముఖి తన వాక్చాతుర్యంతో ఇప్పటికే ఎంతో మందిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే శ్రీముఖి యాంకర్‌గానే కాదు.. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కానీ ఈమెకు సినిమాల ద్వారా అంత గుర్తింపు రాలేదు. షోల ద్వారానే బాగా గుర్తింపు వచ్చింది.
ఇక ప్రస్తుతం బుల్లితెర టాప్ యాంకర్లలో సుమ, శ్రీముఖి, అనసూయ ఉన్నారని చెప్పవచ్చు. కానీ అనసూయ టీవీ షోలలో తక్కువగా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక సుమ, శ్రీముఖి మాత్రమే టీవీ షోలలో బాగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉన్నారు. అయితే శ్రీముఖి ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ను తీసుకుంటుండడంతో ముందు ముందు ఈమె ఇంకా ఎంత డిమాండ్ చేస్తుందోనని చర్చించుకుంటున్నారు. మరి ఈమెకు సినిమాల్లో ఏమైనా చాన్స్‌లు వచ్చి దశ తిరుగుతుందేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…