Anchor Rashmi Gautam : బుల్లితెర స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా ఈమె మరింత పాపులర్ అయ్యింది. అప్పుడప్పుడు సినిమాల్లోనూ, పలు ఇతర షోల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోంది. అయితే బుల్లితెరపై రష్మి, సుధీర్ ఒకే వేదికపై కనిపిస్తే.. వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆ షోకు రేటింగ్స్ కూడా బాగానే వస్తుంటాయి.
బుల్లితెరపై యాంకర్ రష్మి గౌతమ్, సుధీర్‌లు పండించే హాస్యానికి, వారి మధ్య ఉండే లవ్ ట్రాక్‌కు ప్రేక్షకులు ఎంతో ఫిదా అవుతుంటారు. అయితే తాజాగా రష్మికి చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈమె గతేడాది లాక్ డౌన్ సమయంలోనే రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు వస్తున్నాయి.
గతంలో సుధీర్‌తో రష్మి లవ్ ట్రాక్ నడిపిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వారు ఇద్దరూ ఆ వార్తలను ఖండించారు. ఆ ట్రాక్ కేవలం షోలకు మాత్రమే పరిమితమని క్లారిటీ ఇచ్చారు. తాము ఇద్దరమూ మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా హల్ చల్ చేస్తున్న వార్తల ప్రకారం.. రష్మి.. ఇండస్ట్రీతో సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్నదట. అతను ఓ ప్రయివేటు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. భర్తతో ఆమె హైదరాబాద్‌లోనే ఉంటుందట. అయితే ఈ విషయం బయటకు వస్తే కెరీర్ పరంగా తనకు ఇబ్బందులు వస్తాయని రష్మి భావించిందట. దీంతోనే తన పెళ్లి విషయాన్ని ఈమె చాలా సీక్రెట్‌గా ఉంచిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్నది తెలియాల్సి ఉంది.
ఇక త్వరలోనే రష్మి తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని అంటున్నారు. గతంలో యాంకర్ రవి కూడా తనకు పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టాడు. దీంతో రష్మి కూడా అదే కోవలో వెళ్తుందా ? అని సందేహిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మి దీనిపై స్పందిస్తుందా..? లేదా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.