Anasuya : ఓ వైపు బుల్లితెరపై సత్తా చాటుతూనే మరోవైపు వెండితెరపై కూడా అనసూయ ఎంతో బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన అనేక చిత్రాలు హిట్ అవుతున్నాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా పుష్ప సినిమాలో ఆమె దాక్షాయణి పాత్రలో కనిపించి అలరించింది. తరువాత రవితేజ ఖిలాడి మూవీలోనూ నటించింది. అయితే ఈ మూవీ హిట్ సాధించలేదు. కానీ అనసూయకు ఫుల్ లెంగ్త్ రోల్ లభించింది. దీంతో ఆమె తన నటనను ప్రదర్శించేందుకు మంచి అవకాశం లభించినట్లు అయింది. ఇక త్వరలో పుష్ప 2 షూటింగ్‌లోనూ ఈమె పాల్గొననుంది.
అయితే కేవలం సినిమాలు.. టీవీ షోలతోనే కాకుండా.. అనసూయ సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను తన ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఇక తాజాగా అనసూయ పెట్టిన ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఆమె ఓ కొటేషన్‌ను షేర్ చేయడం విశేషం. అందులో ఏముందంటే.. నీ నటన, నీ లుక్, నువ్వు మాట్లాడే విధానం.. వంటి అంశాలను ఎవరైతే ఇష్టపడరో.. వారు నీవాళ్లు కాదు.. వాళ్లను మెప్పించడం కోసం నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పనిలేదు.. నువ్వే.. నిన్నంటే ఇష్టపడే వారి మధ్య ఉండు.. నిన్ను ఇష్టపడని వాళ్లకు దూరంగా ఉండు.. నీలా నువ్వు ఉన్నందుకు నువ్వు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన పని కూడా లేదు.. అని అనసూయ ఆ వీడియోలో ఓ కొటేషన్‌ను షేర్ చేసింది.
సాధారణంగా అనసూయను ఇష్టపడే వారు ఎంత మంది ఉంటారో.. సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు చేసేవారు కూడా అంతే మంది ఉన్నారు. కనుక అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలని.. వారు అనేది పట్టించుకోకూడదని.. ఆమె ఇలా ఇన్‌డైరెక్ట్‌గా ఓ కొటేషన్‌ను షేర్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక అనసూయ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతోనే కాకుండా టీవీ షోలతోనూ ఎంతో బిజీగా ఉంది. ఇతర భాషలకు చెందిన మూవీల్లోనూ ఈమె నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…