Anasuya : బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సక్సెస్ సాధించిన అతి కొద్ది మంది యాంకర్లలో యాంకర్ అనసూయ ఒకరు. ఈమె యాంకర్‌గా, నటిగా రాణిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది. జబర్దస్త్‌తోపాటు పలు స్పెషల్ ఈవెంట్లలోనూ అనసూయ అదరగొడుతోంది. జబర్దస్త్ షోలో తనదైన స్టైల్‌లో ఈమె ప్రేక్షకులను అలరిస్తుంటుంది. తన డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.
ఇక అందంతోపాటు అభినయం కూడా తన సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు వరుసగా సినిమాల్లో ఆఫర్లను అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిజీగా మారిపోయింది. ఈమె ఎంబీఏ చేసింది. మొదట్లో ఒక జాబ్ చేసింది. తరువాత ఒక చానల్‌లో యాంకర్‌గా చేసింది. ఆ తరువాత జబర్దస్త్ యాంకర్‌గా మారింది. దీంతో ఆమె ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. జబర్దస్త్‌తో ఆమె ఫేట్ మారిపోయిందనే చెప్పవచ్చు. అక్కడి నుంచి ఆమె కెరీర్ ఓ కీలక మలుపు తిరిగింది. దీంతో తంతే బూరెల బుట్టలో పడినట్లు.. అనసూయ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా అమాంతం పెరిగింది.

ఇక అనసూయ అనేక సినిమాల్లో నటించి ఇప్పటికే నటిగా తానేంటో నిరూపించుకుంది. ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం అనే సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ అదరగొట్టింది. ఈ పాత్ర ఆమెకు ఎంత పేరు తెచ్చి పెట్టిందంటే.. ఇప్పటికీ అనసూయను రంగమ్మత్త అని పిలుస్తుంటారు. అంతలా ఈ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇక అనసూయ అడివి శేష్ హీరోగా నటించిన క్షణం మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా నటించి అలరించింది. అలాగే పుష్పలో దాక్షాయణి అనే నెగెటివ్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక అనసూయ ఇటీవలే రవితేజ ఖిలాడి సినిమాలో ఓ గ్లామర్ పాత్రలో నటించింది. ఇక థాంక్ యూ బ్రదర్ అనే మూవీతోపాటు మరికొన్ని సినిమాల్లోనూ ఈమె నటించింది. అలాగే ప్రస్తుతం పలు వరుస సినిమాలు చేస్తూ ఈమె ఎంతో బిజీగా మారిపోయింది. ఇక ఇటీవలే అనసూయ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంది. దీంతో తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి ఈమె థాంక్స్ చెప్పింది. అందుకు గాను ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఈమె వైట్ గౌన్‌లో దర్శనమిచ్చింది. ఎద అందాలు కనిపించేలా అనసూయ ఆ ఫొటోలను షేర్ చేసింది. వాటితోపాటు తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారికి థాంక్స్ చెబుతూ కాప్షన్ పెట్టింది. దీంతో ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.