Anasuya : బుల్లితెరపై అత్యంత విజయవంతం అయిన షోలలో బిగ్ బాస్ ఒకటి. బిగ్ బాస్ ఇప్పటి వరకు 5 సీజన్లను పూర్తి చేసుకుని 6వ సీజన్ కోసం రెడీ అవుతోంది. అయితే మొన్నీ మధ్యే బిగ్ బాస్ ఓటీటీ పేరిట ఒక షోను నిర్వహించారు. కానీ దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. ఇక సీజన్ 6 కోసం ప్రస్తుతం నిర్వాహకులు అంతా సిద్ధం చేస్తుండగా.. త్వరలోనే ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ షో ప్రారంభం కానుంది సమాచారం. ప్రస్తుతం ఇంటి సెట్‌ను నిర్మిస్తుండడంతోపాటు కంటెస్టెంట్ల కోసం కూడా వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి షో కోసం యాంకర్ అనసూయను నిర్వాహకులు సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.
బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటుతున్న వారిలో అనసూయ ఒకరు. ఈమె టీవీ షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తోంది. అయితే ఈమెను బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా తీసుకోవాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు గాను ఆమెకు భారీగానే పారితోషికాన్ని ముట్టజెబుతామని ఆఫర్ కూడా ఇచ్చారట. ఏకంగా రూ.1 కోటి ఇస్తామని అన్నారట. అయితే ఇందుకు అనసూయ యెస్ చెప్పిందా.. నో చెప్పిందా.. అన్న వివరాలు మాత్రం తెలియడం లేదు.
అనసూయ ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. కనుక ఈమె బిగ్ బాస్ ఆఫర్‌ను తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే షోలో అనసూయ పాల్గొంటే కనీసం 6 వారాల పాటు అయినా ఉండే చాన్స్ ఉంది. అంటే.. అన్ని రోజులు రోజుకు రూ.3 లక్షలు (ఆమె ఒక ఎపిసోడ్ లేదా ఈవెంట్‌కు తీసుకునేది) వేసుకుంటే.. రూ.1.26 లక్షలు అవుతాయి. అంటే.. ఆమెకు బిగ్ బాస్ వారు ఆఫర్ చేసేది ఇంకా తక్కువే అవుతుంది. కానీ రూ.1.50 కోట్ల వరకు ఆఫర్ చేస్తే ఆమె రావచ్చు. వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. మరి అనసూయ బిగ్ బాస్ ఆఫర్‌ను అందుకుని షోలో పాల్గొంటుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…