Akhanda 2 : నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తరువాత అఖండ మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. దీంతో బాలయ్య అభిమానుల జోరు మామూలుగా లేదు. అఖండ చాలా పెద్ద హిట్ కావడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ఏకంగా 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కరోనా అనంతరం వచ్చినప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా విజయంలో అదే కీలకపాత్ర పోషించిందని చెప్పవచ్చు. అయితే అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి చిత్ర యూనిట్ తాజాగా ఒక హింట్ అయితే ఇచ్చింది.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ అనంతరం అనిల్ రావిపూడితో 108వ సినిమా చేస్తారు. పక్కా కామెడీ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌లలో ఈ మూవీ ఉంటుంది. ఇక ఈ మూవీ కూడా అయ్యాకే అఖండ 2 ఉంటుందని తేల్చారు. తన 109వ సినిమాగా అఖండ 2 ఉంటుందని చెప్పేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీని 2024 ఎన్నికలకు ఒకటి లేదా రెండు నెలల ముందు రిలీజ్ చేస్తారని అంటున్నారు.
అప్పట్లో.. అంటే.. 2014లో ఎన్నికలకు ముందు వచ్చిన లెజెండ్ మూవీ టీడీపీకి కాస్త బూస్టింగ్ అయితే ఇచ్చింది కానీ మరీ అంత పెద్ద ప్రభావం చూపించలేదు. కానీ అఖండ 2 ద్వారా వచ్చే ఎన్నికలకు ఉపయోగపడే విధంగా సినిమాను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అందుకు గాను దర్శకుడు బోయపాటి ఇప్పటి నుంచే కథను చాలా పకడ్బందీగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే 2024 ఎన్నికల వరకు అఖండ 2 రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. అయితే 107, 108 సినిమాల తరువాత బాలకృష్ణ ఇంకేదైనా మూవీ చేస్తారా.. లేక నేరుగా అఖండ 2నే చేస్తారా.. అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కానీ అఖండ 2కే ఆయన మొగ్గు చూపే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…