Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ అనసూయ. బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా రచ్చ చేస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంటుంది. తాజాగా అనసూయ చీరకట్టులో హోయలు పోతూ మైమరచిపోయింది. ఈ అమ్మడి క్యూట్ నెస్ చూసి మంత్ర ముగ్ధులు అవుతున్నారు. నా కన్నా నన్ను ఎవరూ ఎరుగరు అంటూ అనసూయ తన వీడియాకి కామెంట్ పెట్టింది.

అనసూయ ప్రధాన పాత్రలో దర్జా టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల దర్జా టీజర్ ను విడుదల చేశారు. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జాలో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. ఈ చిత్రంలో ఆమె లేడీ రౌడీ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ తోనే దర్జా సినిమాపై అంచనాలు పెంచేసింది అనసూయ. కొద్ది రోజుల క్రితం పుష్ప మూవీలో అనసూయ దాక్షాయణిగా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకుంది.
View this post on Instagram
అనసూయ మలయాళ, తమిళ భాషల్లో రెండు చిత్రాలు చేస్తోంది. మరోవైపు అనసూయ పొట్టి బట్టలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటిల్లిపాదీ చూసే బుల్లితెరపై మితిమీరిన గ్లామర్ ఏమిటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలను అనసూయ తిప్పికొడుతోంది. నా బట్టలు నా ఇష్టం అనే అనసూయ.. ధరించే బట్టల ఆధారంగా జడ్జింగ్ చేస్తారా ? అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. పొట్టిబట్టలలో అనసూయ గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.