Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అనసూయ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో అనసూయ నటించింది. అయితే ఈ సినిమాలో నటించిన అనసూయ.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. గాడ్‌ఫాదర్ మూవీలో ఓ మీడియా ఛానల్ ప్రతినిథిగా అనసూయ కనిపించింది.
చిరంజీవి సినిమాలో నటించినప్పటికీ.. ప్రమోషన్స్‌లో కనిపించకపోవడంతో.. ఆమెని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు నెటిజన్లు.. అయితే వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే.. సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేదని అనసూయ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ అనసూయ మీద ట్రోల్స్ ఆగడం లేదు. ఈ సందర్భంగా అనసూయ.. ఎందుకు నేనంటే మీకు అంత పిచ్చి ప్రేమ.. నేను మీకు చాలా ముఖ్యం. నేను ఏదన్నా అంటే మీరు ఫీల్ అవుతారు.. అయ్యో పిచ్చి క్యూటీస్.. ఇప్పుడు ఆ పిచ్చి క్యూటీస్ మళ్లీ రియాక్ట్ అవుతారా.. సరే మీ దగ్గర నా కోసం అంత టైం ఉంటే మీ ఇష్టం అంటూ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసింది అనసూయ.

మళయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం గాడ్‌ఫాదర్. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యదేవ్, నయనతార కీలకపాత్రల్లో నటించారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ముఖ్యపాత్రలో కనిపించాడు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి, ఎన్వి ప్రసాద్ లు నిర్మించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.