Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ తన ప్రతి ఫీలింగ్‌ని, మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అలాగే తనపై చేసే పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌కి అంతే దీటుగా ఆన్సర్ ఇస్తుంది అనసూయ.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు మరింతగా రచ్చ చేశాయి. ఇటీవల ఆంటీ అంటూ తనను ట్రోలింగ్ చేసిన నెటిజన్లకు యాంకర్ అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ గ్లామర్ ఫొటోలతో ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. కానీ కొద్దిరోజులుగా డ్యాన్స్ వీడియోలతో దర్శనమిస్తూ రచ్చ చేస్తుంది. మహేశ్ బాబు ఒక్కడు మూవీలోని నువ్ ఏ మాయ చేశావో గానీ అనే పాటకు స్టెప్పులేసింది.

దానికి మంచి రెస్పాన్స్ రావడంతో.. తాజాగా విజిల్ విజిల్ అనే పాటకు చిందులేసింది. అనసూయ స్టెప్పులు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. రెడ్ డ్రెస్ పైన వైట్ కోట్ తో వెరైటీ కాస్ట్యూమ్స్ తో ఆకట్టుకుంది అనసూయ. ఈ అమ్మడు గతంలో జబర్దస్త్ స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకునేది. ఇటీవల ఆ షో నుంచి తప్పుకున్న అనసూయకు జబర్దస్త్ గుర్తొచ్చిందేమో అన్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అనసూయ నటించిన పలు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు కనుక హిట్ అయితే అనసూయ కెరీర్‌కి తిరుగుండదని అంటున్నారు.
View this post on Instagram