Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అనసూయ తన ప్రతి ఫీలింగ్‌ని, మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అలాగే తనపై చేసే పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌కి అంతే దీటుగా ఆన్సర్ ఇస్తుంది అనసూయ.
అయితే అనసూయ కెరీర్ కష్టాల్లో నెట్టివేయబడిందని బుల్లితెర వర్గాల్లో చర్చ జరుగుతుంది. మల్లెమాల ఈటీవీ నుండి దూరం అయిన అనసూయ స్టార్ మాలో వరుసగా కార్యక్రమాలను చేయబోతున్నట్లుగా ఆమె ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పటి వరకు ఆమెకు చెందిన స్టార్ మా కార్యక్రమాలు రావడం లేదు. అసలు ఇప్పట్లో ఆమె స్టార్ మా కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో కూడా తెలియదు. పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు మరింతగా రచ్చ చేశాయి.

దీంతో ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న మంచి పేరు మరియు ప్రతిష్టలు సన్నగిల్లాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే అనసూయ సినిమాల్లో మరియు బుల్లితెరపై ఒకప్పటిలా బిజీగా ఉండే అవకాశం లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే అనసూయ ప్రస్తుతానికి ఖాళీ ఉన్నా భవిష్యత్తులో మళ్లీ పుంజుకుంటుందని.. ఆమె జబర్దస్త్ స్థాయిలో మళ్లీ స్టార్ మా ఛానల్ కి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటుందని కొందరు ఆశాభావంతో ఉన్నారు. ఒక వేళ అదే జరగకపోతే.. అనసూయ కెరీర్ డౌన్ ఫాల్ మొదలైనట్టే. చూడాలి ఏం జరుగుతుందో.