Anasuya Bharadwaj : బుల్లితెర యాంకర్‌గా తన ప్రస్థానం మొదలు పెట్టిన అనసూయ నెమ్మదిగా సినిమాల్లోనూ యాక్ట్ చేయడం ప్రారంభించింది. తరువాత ఆమెకు వరుస ఆఫర్లు రాసాగాయి. ఆమె నటించిన చిత్రాలు హిట్ అవుతుండడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో నటిగా కూడా అనసూయ తానేంటో నిరూపించుకుంది. అయితే ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పదమైన పోస్టు పెట్టి వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరోసారి ఈమె నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ఇంతకీ అసలు ఏమైందంటే..

మార్చి 8వ తేదీన మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి మొదలుకొని సామాన్యుల వరకు అందరూ మహిళలను కీర్తిస్తున్నారు. అయితే అనసూయ మాత్రం తనకు వుమెన్స్ డే అసలు పట్టనట్లు పోస్టు పెట్టింది. కొందరు మగాళ్లు అలాగే ఉన్నారు.. అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది.
మహిళా దినోత్సవం రోజే కొందరు మగాళ్లకు మహిళలు గుర్తుకు వస్తారు. ఆరోజు వారు మహిళలను పూజిస్తూ మర్యాద ఇస్తారు. అది కేవలం 24 గంటలే. ఆ తరువాత యథావిధిగా వారు మహిళలను విమర్శిస్తూ వేధింపులకు గురి చేస్తుంటారు.. కనుక ఇది హ్యాప్పీ వుమెన్స్ డే కాదు.. హ్యాప్పీ ఫూల్స్ డే.. అని అనసూయ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్టుకు కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ మగాళ్లందరూ ఒక్కటే అని అనుకుంటుందని.. ఆమె అనుకుంటున్నది తప్పని.. సమాజంలో మగాళ్లు అందరూ ఒకేలా ఉండరని.. ఆమెకు చురకలు అంటించారు. ఈ క్రమంలోనే ఆమె పోస్టు వైరల్‌గా మారింది.