Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవలే ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించిన విషయం విదితమే. అయితే ఇప్పుడు తాజాగా మొబైల్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు కంపెనీలకు చెందిన ఫోన్లపై ఏకంగా 40 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు. అందులో భాగంగానే వినియోగదారులు వన్‌ప్లస్, షియోమీ, శాంసంగ్, ఐక్యూ, టెక్నో, ఒప్పో, రియల్‌మి, వివో వంటి కంపెనీలకు చెందిన ఫోన్లపై తగ్గింపు ధరలను పొందవచ్చు. ఇక ఈ సేల్‌లో అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
యాపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జి, ఎం33 5జి, ఎం53 5జి, ఎం13 5జి, షియోమీ రెడ్‌మీ 9ఎ, రెడ్‌మీ 9 యాక్టివ్, రెడ్ మీ నోట్ 11, నోట్ 10టి 5జి, నోట్ 10 ప్రొ, నోట్ 10 ప్రొ మ్యాక్స్, నోట్ 10ఎస్, రెడ్‌మీ 10 ప్రైమ్, రెడ్‌మీ 10ఎ, షియోమీ 11 లైట్, 11టి ప్రొ, 12 ప్రొ ఫోన్లపై ఈ సేల్‌లో డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే వన్‌ప్లస్ 10ఆర్, నోర్డ్ సీఈ2 లైట్ 5జి, నోర్డ్ 2టి 5జి, నోర్డ్ సీఈ 2 5జి, ఐక్యూ నియో 6 5జి, జడ్6 ప్రొ, జడ్6 5జి, టెక్నో స్పార్క్ 8 ప్రొ, పాప్ 5 ఎల్‌టీఈ, స్పార్క్ 8టి.. వంటి ఫోన్లపై కూడా ఈ సేల్‌లో డిస్కౌంట్‌లను పొందవచ్చు.

ఇక సిటీబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులకు గాను 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే ఇతర కార్డులకు అయితే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.20వేల విలువైన ప్రయోజనాలు పొందవచ్చు.