Amazon Prime Video : అమెజాన్ ప్రైమ్‌పై ప్రేక్ష‌కుల ఆగ్ర‌హం.. భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..!

Amazon Prime Video : యష్ హీరోగా కేజీఎఫ్‌కు సీక్వెల్ గా వ‌చ్చిన మూవీ కేజీఎఫ్ 2. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న రికార్డుల‌ను న‌మోదు చేస్తోంది. హిందీ మార్కెట్‌లో బాహుబ‌లి 2 త‌రువాత అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను సాధించి సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్ప‌టికీ ఈ మూవీని చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్తున్నారు. అయితే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. అమెజాన్ ప్రైమ్ అందుకు గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను కూడా కొనుగోలు చేసింది. కానీ ప్రేక్ష‌కుల‌కు ఆ సంస్థ ఒక్క‌సారిగా షాకిచ్చింది. ఎందుకంటే ఓటీటీలో వ‌స్తే స‌హజంగానే సినిమాను ఉచితంగానే చూస్తామ‌న్న భావ‌న‌లో ప్రేక్ష‌కులు ఉన్నారు. కానీ ఓటీటీలో రిలీజ్ అయినప‌ప్ప‌టికీ ఈ మూవీని చూడాలంటే రూ.199 చెల్లించాల‌ని అమెజాన్ ప్రైమ్ ష‌ర‌తు విధించింది. దీంతో అమెజాన్ ప్రైమ్ నిర్ణ‌యంపై ప్రేక్ష‌కులు మండిప‌డుతున్నారు. ఆ సంస్థను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

కేజీఎఫ్ 2 సినిమాను చూడాలంటే రూ.199 చెల్లించి పే ప‌ర్ వ్యూ ప‌ద్ధతిలో చూడాల‌ని అమెజాన్ ప్రైమ్ ష‌ర‌తు పెట్టింది. అయితే ఇలాంటి మోడ‌ల్ అమెరికాలో ఎప్ప‌టి నుంచో ఉంది. భార‌త్‌లోనే కొత్త‌. దీంతో ఇప్ప‌టికే ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ కోసం డ‌బ్బులు చెల్లించాం క‌దా.. ఇప్పుడు ఈ కొత్త మెలిక ఏమిటి ? ఓటీటీలో సినిమా వ‌స్తే ఉచితంగానే చూస్తున్నాం క‌దా.. ఇప్పుడు డ‌బ్బులు చెల్లించాల‌ని ఎందుకు అడుగుతున్నారు ? అంటూ ప్రేక్ష‌కులు అమెజాన్ ప్రైమ్‌ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆ సంస్థ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా చూసేందుకు డ‌బ్బులు చెల్లించాల్సి వ‌స్తే.. అంత మాత్రానికి ఎంతో ధ‌ర పెట్టి అమెజాన్ ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను తీసుకోవ‌డం ఎందుకు ? ఇది క‌చ్చితంగా దోపిడీయే అని ఆ సంస్థ‌పై ప్రేక్ష‌కులు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే సోష‌ల్ మీడియాలో అమెజాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Amazon Prime Video

ఇక పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో రూ.199 కి సినిమా అందుబాటులో ఉండ‌డంతో కొంద‌రు వెబ్‌సైట్ల నిర్వాహ‌కులు ఈ మూవీని కాపీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టేశారు. దీంతో ఎలాంటి రుసుము లేకుండానే ఈ మూవీ ఆన్‌లైన్‌లో ఉచితంగా ప‌లు టోరెంట్ సైట్ల‌లో ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాము రూ.199 చెల్లించ‌కుండానే సినిమా హెచ్‌డీ ప్రింట్‌ను పొందుతున్నామ‌ని ప్రేక్ష‌కులు అమెజాన్‌కు ట్వీట్ చేస్తున్నారు. ఇక కొంద‌రు అమెజాన్ ప్రైమ్ స‌బ్ స్క్రిప్ష‌న్‌ను వ‌దులుకుంటున్న‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్ 2 విష‌యంలో అమెజాన్ ప్రైమ్ కు సెగ తగిలింద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌రి దీనిపై అమెజాన్ ప్రైమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM