Amazon : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2022 ను నిర్వహిస్తోంది. ఈ సేల్ జనవరి 17న ప్రారంభం కాగా 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో అనేక ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 70 శాతం, టీవీలపై 60 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా యాపిల్ ఫోన్ 12 సిరీస్ ఫోన్లు, వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్లు, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జి, వన్ ప్లస్ నార్డ్ 2, ఐక్యూ 7, గెలాక్సీ ఎ52ఎస్ 5జి, గెలాక్సీ ఎం52 5జి, షియోమీ 11 లైట్, ఐక్యూ జడ్5, రెడ్‌మీ నోట్ 10ఎస్, గెలాక్సీ ఎం12, రియల్ మి నార్జో 50ఐ ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో ల్యాప్ టాప్‌లపై 40 శాతం, స్టోరేజ్ డివైస్‌లపై 70 శాతం, స్పీకర్లపై 75 శాతం తగ్గింపు ధరలను పొందవచ్చు. దీంతోపాటు పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్ వాచ్‌లు, బ్యాండ్స్‌పై కూడా డిస్కౌంట్ ధరలను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.