Amazon : దసరా పండుగ సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే ఈ సేల్‌లో ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్లను ఇస్తున్నారు. కనుక ల్యాప్ టాప్‌ను కొనాలని అనుకుంటున్నవారికి ఇంతకు మించిన సమయం దొరకదనే చెప్పాలి. కనుక ఇప్పుడే ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయండి. అద్భుతమైన ఆఫర్లను పొందండి.
ఈ సేల్‌లో డెల్ కంపెనీకి చెందిన వోస్ట్రో 3400 14 ఇంచుల ల్యాప్‌టాప్ రూ.5వేల డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.57,990 ఉండగా.. దీన్ని రూ.52,990కి కొనుగోలు చేయవచ్చు. అలాగే లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 టెన్త్ జెన్ ఇంటెల్ కోర్ ఐ3 15.6 ఇంచుల ల్యాప్‌టాప్ ధర రూ.52,290 ఉండగా.. దీనిపై ఏకంగా రూ.16,300 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో ఈ ల్యాప్ టాప్ రూ.35,990 ధరకే లభిస్తోంది.
ఇక హెచ్‌పీ 15 11వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ 15.6 ఇంచ్ ల్యాప్‌టాప్ ధర రూ.59,452 ఉండగా, రూ.4,462 తగ్గింపుతో రూ.54,990 ధరకు లభిస్తోంది. అదేవిధంగా హెచ్‌పీ 14ఎస్ థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ 14 ధర రూ.53,798 ఉండగా, రూ.4808 తగ్గింపుతో రూ.48,990 ధరకు లభిస్తోంది.
డెల్‌కు చెందిన 15 (2021) ఐ3-1115జి4 ల్యాప్‌టాప్ ధర రూ.56,776 ఉండగా, రూ.14,786 తగ్గింపుతో రూ.41,990 ధరకు కొనవచ్చు. అసుస్ వివోబుక్ 14 (2021) ఇంటెల్ కోర్ ఐ5-1135జి7 11వ జెన్ 14 ఇంచ్ థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ ధర రూ.70,990 ఉండగా, రూ.16వేల డిస్కౌంట్‌తో రూ.54,990 ధరకు లభిస్తోంది.
అలాగే ఎంఐ నోట్ బుక్ హరైజాన్ ఎడిషన్ 14 ఇంటెల్ కోర్ ఐ7-10510యు 10వ జెన్ థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ ధర రూ.65,999 ఉండగా, రూ.12వేల తగ్గింపుతో రూ.53,999 ధరకు లభిస్తోంది. మరింకెందుకాలస్యం.. వెంటనే మీకు నచ్చిన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయండి.. ఇంతకన్నా మంచి అవకాశం లభించకపోవచ్చు.