Amazon Fab Phones Fest : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో మరో సేల్‌ను ప్రారంభించింది. ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ పేరిట ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు టాప్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ముఖ్యంగా లావా, షియోమీ, శాంసంగ్, టెక్నో, యాపిల్, రియల్‌మి, ఐక్యూ వంటి ఫోన్లపై ఏకంగా 40 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 12 (64 జీబీ), లావా అగ్ని 5జి, లావా ఎక్స్2, లావా జడ్21, శాంసంగ్ గెలాక్సీ ఎం12, గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జి, గెలాక్సీ ఎం32 5జి, ఎం33 5జి, ఎం52 5జి, రెడ్‌మీ 9ఎ స్పోర్ట్, నోట్ 11, నోట్ 11ఎస్, నోట్ 10టి 5జి, ఎంఐ 11ఎక్స్, షియోమీ 11 లైట్ ఎన్ఈ 5జి, 11టి ప్రొ, ది టెక్నో స్పార్క్ 8 ప్రొ, టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ, టెక్నో స్పార్క్ 8టొ, స్పార్క్ 8సి, ది టెక్నో ఫాంటమ్ ఎక్స్, ఐక్యూ జడ్5 5జి, ఐక్యూ 9 5జి, ఐక్యూ 9 ఎస్ఈ 5జి, ఐక్యూ జడ్6 5జి, ఐక్యూ జడ్3.. తదితర ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను పొందవచ్చు.

ఇక ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే మరో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు ఆకర్షణీయమైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నారు. అలాగే 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్లు రూ.20వేల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. 6 నెలల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయం, 3 నెలల పాటు అదనంగా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం తదితర ఆఫర్లను ఈ సేల్‌లో పొందవచ్చు.