Amazon : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ విద్యార్థులకు అద్భుతమైన బంపర్ ఆఫర్ కల్పించింది. ఏకంగా 500 కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి అమెజాన్ ముందుకు వచ్చింది. ఆ సంస్థకు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాల్లో ఉచితంగా శిక్షణనివ్వడంపై అమెజాన్ పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నట్లు తెలియజేసింది.
ఈ క్రమంలోనే అమెజాన్ అంతర్జాతీయంగా 2.9 కోట్ల మంది విద్యార్థులకు 500 పైగా డిజిటల్ ట్రైనింగ్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం అమెజాన్ వెబ్ సర్వీస్ ఉన్నత విద్యా సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వాలు, కంపెనీలు మొదలైన వాటితో పని చేయనుంది. అలాగే భారతదేశంలో ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్ పేరిట 12 వారాల పాటు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా కోర్సును అందించనున్నారు.
విద్యార్ధులకు ఈ కోర్సులు క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరియర్‌కు ఉపయోగపడుతాయి. 2017 వ సంవత్సరం నుంచి దేశీయంగా దాదాపు 10 లక్షల మందికి శిక్షణనిచ్చినట్లు ఏడబ్ల్యూఎస్ వెల్లడించింది. విద్యార్థులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమెజాన్ సూచించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…