Malle Pulu : తొలి రోజు రాత్రి నూత‌న దంప‌తుల కోసం మ‌ల్లెపూల‌నే ఎందుకు వాడుతారో తెలుసా..?

Malle Pulu : మన దేశంలో స్త్రీలకు తలలో పువ్వులు అలంకరించుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఫాలో అయ్యే ప్రతి మ‌హిళా తలనిండా పూలు పెట్టుకుంటూ కనిపిస్తుంది. మ‌హిళ‌లు ఎప్పుడైతే పూలను పెట్టుకుంటారో వారి అందం మరింత రెట్టింపు అవుతుంది. పూల‌ను తలలో ధరిస్తే మానసిక ఆనందం కూడా కలుగుతుంది. మ‌హిళ‌లు అందరూ ఎక్కువగా ఇష్టపడే పూలు మల్లె పువ్వులు. మల్లెపూలను అందుకే పూలకు రాణి అని పిలుస్తారు. స్త్రీలు మల్లె పూలను ఇష్టపడం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని ఎవరికీ తెలియదు.

ప్రకృతిలో ల‌భించే ప్రతి వస్తువుతోనూ మనకి ఏదో ఒక లాభం ఉంటుంది. మల్లెపూలు మంచి సువాసనను కూడా కలిగి ఉంటాయి. అయితే ఎక్కువగా మల్లెపూలను మ‌హిళ‌లు ఎందుకు తలలో పెట్టుకుంటారంటే.. మల్లెపూల వాసన వల్ల తల్లి నుంచి బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువ రోజులు ఉత్పత్తి అవుతాయని పూర్వీకులు చెప్పేవారట. అందుకే పూర్వం మ‌హిళ‌లు ఎక్కువగా మల్లెపూలను తలలో ధరించేవారట.

Malle Pulu

అంతేకాకుండా  మల్లెపూలు మానసికంగానూ ఆహ్లాదాన్ని అందిస్తాయి. వాటి వాసనకు మనసు ఆహ్లాదం కలుగుతుంది. అందుకే ఫస్ట్ నైట్‌ రోజున‌ ఎక్కువగా మల్లెపూలతో డెకరేషన్ చేస్తుంటారు. ఇవి మ‌న‌సుకు ఆహ్లాదాన్ని క‌లిగించ‌డం వ‌ల్ల మ‌న‌స్సు హాయిగా మారుతుంది. దీంతో కొత్త దంప‌తులు ఎలాంటి ఆందోళ‌న చెంద‌కుండా శృంగారంలో భేషుగ్గా పాల్గొంటారు. వారికి ఉండే భ‌యాలు పోతాయి. క‌నుక‌నే ఫ‌స్ట్ నైట్ రోజు మ‌ల్లెపూల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఇక నిద్రలేమితో బాధపడేవారు చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు మల్లెపూలను తల దిండు పక్కనే పెట్టుకుని నిద్రించాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. లేదంటే దీర్ఘ శ్వాసతో సువాసనను పీల్చాలని.. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే.. మంచి నిద్ర పడుతుందని చెబుతున్నారు.

చాలా మంది బాగా శ్ర‌మించ‌డం వ‌ల్ల కళ్ల‌ మంటల సమస్య వ‌స్తుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. అలాంటి వారు కళ్ళపై మల్లెపూలు పెట్టుకొని క్లాత్ తో కళ్ళు కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటిలో ఉండే వేడిని మల్లెపూలు తగ్గిస్తాయి. తద్వారా ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇంకా డిప్రెషన్, అతి కోపంతో బాధపడేవారిని శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఎక్కువగా ఉంటుందట.  కేవలం పువ్వే కదా అనుకునే మల్లెపువ్వులో ఎన్ని సైంటిఫిక్ ఉపయోగాలు ఉన్నాయో చూశారా.. అందుకే మన పూర్వీకులు ఏ నియ‌మం పెట్టినా దానిలో ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. క‌నుక మ‌ల్లెపూల‌ను పై విధంగా ఉప‌యోగించి ప‌లు లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Mounika

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM