Kokum Fruit : ఈ పండ్ల గురించి తెలుసా.. వీటిని తింటే బోలెడు లాభాలు.. అస‌లు ఊహించ‌లేరు..

Kokum Fruit : కోకుమ్ ని కొంకణి కూరల్లో పులుపు కోసం ప్రధాన పదార్థంగా వాడతారు. దీనిని గార్సినియా ఇండికా అని పిలుస్తారు. కోకుమ్ లో యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కోకుమ్ ను వృక్షమాలా అని కూడా పిలుస్తారు. గార్సినియా ఇండికా మొక్క భారతదేశంలోని పశ్చిమ కనుమలలో మరియు అండమాన్ నికోబార్ దీవులలో ఎక్కువగా కనిపిస్తుంది. కోకుమ్ ని ఆహారంగా తీసుకోవటం వలన ఆకలిని నియంత్రించి, అధిక బరువుని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి, గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని కొవ్వుని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. కోకుమ్ లోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. కోకుమ్ ని జ్యూస్‌గా తీసుకోవటం వలన శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.

కోకుమ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల కోకుమ్ 60 కేలరీల శక్తిని అందిస్తుంది. కోకుమ్‌లో కేలరీలు మరియు కొవ్వులు తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల కోకుమ్‌ 2 గ్రాముల ఫైబర్‌ను అందిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి3, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ మరియు జింక్ కూడా ఉన్నాయి. కోకుమ్‌లో ఎసిటిక్ యాసిడ్ మరియు హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. అందువల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. ఈ పండులో అధికంగా యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఈ పండు అనేక బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్‌లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గార్సినియా ఇండికా సహాయంతో పేగు అలెర్జీలను తగ్గించవచ్చని అధ్యయనాలు కూడా నిరూపించాయి.

Kokum Fruit

కోకుమ్‌లో HCA (హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్) అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆకలిని అణిచివేసే విధంగా పనిచేస్తుంది. కోకుమ్ బరువు తగ్గడంలో సహాయపడటానికి మరొక కారణం దాని అధిక ఫైబర్ కంటెంట్. ఒక గ్లాసు ఫ్రెష్ కోకుమ్ జ్యూస్ తాగడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. కోకుమ్‌ పండు కార్బోహైడ్రేట్‌లను కొవ్వులుగా మార్చడాన్ని కూడా తగ్గిస్తుంది. తద్వారా అధిక బరువు నియంత్రణకు ఈ ఫలం అత్యంత ప్రభావవంతమైన పదార్థంగా పనిచేస్తుంది.

ఆందోళన, ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మెదడును చురుకుగా ఉంచి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది. కోకుమ్‌ అనేది పండు రూపంలో దొరుకుతుంది. అదేవిధంగా  డ్రై ఫ్రూట్ రూపంలో కూడా లభ్యమవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కోకుమ్‌ పండును తినటానికి తప్పకుండా ప్రయత్నం చేయండి.

Share
Mounika

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM