Pears : ఈ పండు మనకి వర్షాకాలంలో అధికంగా లభిస్తుంది. ప్రజలు ఈ పండును తినడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ దీనిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఆరోగ్య ప్రేమికులు ఎవరూ తినకుండా ఉండలేరు. ఆ పండే పియర్స్. ఈ పియర్స్ ను తెలుగులో బేరి పండు అంటారు. యాపిల్ కంటే ఎక్కువ తియ్యగా, ఎక్కువగా ఫైబర్ ఉండే పండు ఇది. అంతేకాకుండా దీనిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా పోషకాలు కలిగి ఉంటాయి. అధిక బరువు ఉన్నవాళ్లు ఈ పండ్లు తినడం వల్ల ఫైబర్ శరీరానికి అందుతుంది.
అంతేకాకుండా డయాబెటిస్ పేషెంట్లు కూడా పియర్స్ ను చక్కగా తినవచ్చు. డయాబెటిస్ పేషెంట్స్ లో చక్కెర స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో సహకరిస్తుంది. ఈ పండులో ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్, విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం, కాపర్, ఫైబర్, ఫోలేట్ తదితర పోషక విలువలు పియర్స్ లో అధికంగా ఉంటాయి. అందువల్ల, రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారికి హిమోగ్లోబిన్ స్థాయిలని పెంచడమే కాకుండా ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో కూడా సహాయపడే పోషకాలు ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఈ పండును నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల రోజంతా ఎంతో శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు.
ఈ పండ్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా కూడా ఉంచుతాయి. పియర్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా పియర్స్ పండ్లను తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయకుండా బరువును నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతాయి. ఈ పండులో ఉండే పోషక విలువలు వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కనుక ఏ విధంగా చూసుకున్నా కూడా అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి కాబట్టి ఈ పండ్లను తినడం అసలు మిస్ చేసుకోకండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…