ఆమని.. ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమని.. శుభలగ్నం, దొంగ వంటి చిత్రాలతో మెప్పించారు. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ఇటీవల చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాల్లో నటించారు. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడూ జడ్జిగా వ్యవహారిస్తున్న ఆమని క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు.
ఆమని తెలుగమ్మాయి అయినప్పటికీ తల్లిదండ్రులు బెంగళూరులో స్థిరపడటంతో అక్కడే పెరిగారు. తండ్రి డిస్ట్రిబ్యూటర్ అవ్వడంతో సినిమాల్లో నటించాలని ఆమని అనుకున్నారు. ఇక చెన్నై వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించింది. అవకాశాల కోసం వెళ్లిన మొదట్లో అడిషన్ కోసం వెళితే రేపు వచ్చి గెస్ట్ హౌస్ లో కలవమని చెప్పారట. అది కూడా ఒంటరిగా రమ్మనడంతో వాళ్ళు ఏ ఉదేశ్యంతో పిలుస్తున్నారో అర్థమైంది అని, అప్పట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి పెదవి విప్పారు ఆమని. అయితే ఆమని అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా కూడా సినిమాలకు దూరం అవ్వలేదు.
బాపు, కే విశ్వనాథ్ వంటి లెజెండరీ డైరెక్టర్స్ చేత శభాష్ అనిపించుకున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి అనేక మంది ఇటీవల ధైర్యంగా ముందుకొచ్చి చెప్తున్నారు. తమిళనాట శరత్ కుమార్ కూతురు.. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్నట్లు తెలపడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇప్పటికైనా వీరు ఇలా బయటకొచ్చి నిజాలు చెప్పడం హర్షించదగ్గ విషయం అని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…