Amala : అక్కినేని నాగార్జునకు ఇద్దరు భార్యలు అన్న విషయం విదితమే. ఆయన మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మి. ఆమెకు నాగచైతన్య జన్మించాడు. ఇక అమల రెండో భార్య. ఈమెకు అఖిల్ పుట్టాడు. అయితే నాగచైతన్య గురించి అమల గతంలో ఎన్నడూ కామెంట్లు చేయలేదు. కానీ చైతూ గురించి ఉన్నట్లుండి ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు అమల ఏమన్నారంటే..

నాగచైతన్యను తాను పెంచలేదని.. తన తల్లి లక్ష్మి వద్దే చెన్నైలో చైతూ పెరిగాడని.. అమల తెలిపారు. అఖిల్ ఒక్కడే తమ వద్ద పెరిగాడని తెలిపారు. అయితే నాగచైతన్యను వాళ్ల అమ్మ లక్ష్మి ఎంతో పద్ధతిగా పెంచారని.. చైతన్య అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వచ్చేవాడని అన్నారు. సెలవులకు లేదా 2-3 నెలలకు ఒకసారి చైతూ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చేవాడని.. చైతూ వస్తే అఖిల్ కు పండగేనని.. అన్న అన్న.. అంటూ చైతూ వెంటే అఖిల్ తిరిగేవాడని.. అమల అన్నారు.
ఇక అఖిల్ చాలా దూకుడుగా.. హైపర్ యాక్టివ్‌గా ఉంటాడని.. కానీ చైతన్య అందుకు పూర్తి విరుద్ధమని అమల అన్నారు. చైతన్య చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటాడని.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటాడని.. చాలా కామ్‌గా ఉంటాడని.. అమల తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అమల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే అంత సున్నితమైన మనస్సు ఉన్న చైతన్యతో సమంత ఎందుకు విడిపోయింది ? అని మళ్లీ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.