Amala Paul : టాలీవుడ్ మన్మథుడిగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా ఓ ఊపు ఊపిన నాగార్జున ఇప్పటికీ కూడా రొమాన్స్ పండిస్తున్నారు. ఇద్దరు పిల్లలతో పోటీగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతోంది.
ఈ చిత్రంలో ముందుగా కాజల్ అగర్వాల్‌ని కథానాయికగా అనుకున్నారు. కానీ సడెన్‌గా ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అమలాపాల్ ఫ్రేములోకి వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో నాగ్, అమలా మధ్య ఘాటుగా రొమాంటిక్ ఎపిసోడ్స్ ఉన్నాయట. సాంగ్ లో వీరిద్దరూ రొమాన్స్ చేస్తారని వినికిడి. అందమైన హిల్ స్టేషన్ లో ప్రవీణ్ ఈ సన్నివేశాలని చిత్రికరించబోతున్నట్లు తెలుస్తోంది.
అందాలు ఆరబోసే అమలాపాల్ కు రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లిప్‌లాక్ సీన్‌కి కూడా ఈ అమ్మడు సై అంది. కాకపోతే ఓ కండిషన్ పెట్టింది. ఆ సీన్ లో నటించాలంటే అదనపు రెమ్యునరేషన్ ఇవ్వాలని కండిషన్ పెట్టిందట. దీనితో మేకర్స్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది.