Allu Arjun : మా అల్లు అర్జున్‌.. నిజంగా బంగారం..!

Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లో కూడా హీరోనే అనిపించుకున్నాడు. సాధార‌ణంగా సినిమాల్లో హీరోలు పొగ తాగ‌డం.. మ‌ద్యం సేవించ‌డం.. వంటి చెడు అల‌వాట్లు క‌లిగి ఉన్న‌వారిగా క‌నిపిస్తుంటారు. సినిమా కోసం వారు అలా చేస్తుంటారు. కొంద‌రికి నిజ జీవితంలోనూ అలాంటి అల‌వాట్లు ఉంటాయి. అయితే సినిమాల వ‌ర‌కు ఓకే.. కానీ నిజ జీవితంలో అలా చేయొద్ద‌ని చెబుతున్నాడు.. అల్లు అర్జున్‌. చెడు అల‌వాట్ల వ‌ల్ల హీరోల‌ను చూసి వారి ఫ్యాన్స్ కూడా అలాగే వ్య‌స‌నాల‌కు బానిస‌లు అవుతార‌ని.. క‌నుక వాటిని ఎంకరేజ్ చేయొద్ద‌ని అల్లు అర్జున్ చెబుతున్నాడు. ఇంత‌కీ అస‌లు విషయం ఏమిటంటే..

Allu Arjun

అల్లు అర్జున్‌కు ఈ మ‌ధ్య‌నే ఓ ప్ర‌ముఖ పొగాకు ఉత్ప‌త్తి కంపెనీ భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. అల్లు అర్జున్ యాడ్స్ చేస్తే భారీగా డ‌బ్బు ముట్ట‌జెబుతామ‌ని చెప్పార‌ట‌. కానీ అందుకు అల్లు అర్జున్ నో చెప్పారట‌. ఎంత డ‌బ్బులు ఇచ్చినా చెడు అల‌వాట్ల‌కు సంబంధించి ప్రోత్స‌హించేలా యాడ్స్ చేయ‌బోన‌ని అల్లు అర్జున్ తేల్చి చెప్పాడ‌ట‌. తాను అలాంటి యాడ్స్‌లో న‌టిస్తే త‌న‌ను చూసి త‌న ఫ్యాన్స్ చెడు అల‌వాట్ల‌ను నేర్చుకుంటార‌ని.. అది త‌న‌కు ఇష్టం లేద‌ని.. పొగ తాగ‌డం.. మ‌ద్యం సేవించ‌డం వంటి యాడ్స్‌లో చేయ‌న‌ని.. అవి హానిక‌ర‌మ‌ని అల్లు అర్జున్ చెప్పాడు.

సినిమాలలో క‌థ‌కు అనుగుణంగా పొగ తాగే సీన్లు, మ‌ద్యం సేవించే సీన్లు.. ఉంటాయి. కానీ అవి వేరే. నిజ జీవితంలో వాటిని పాటించొద్దు.. క‌నుక‌నే పొగాకు యాడ్స్‌కు ఒప్పుకోవ‌డం లేదు.. అని అల్లు అర్జున్ తేల్చి చెప్పార‌ట‌. దీంతో బ‌న్నీ చేసిన ప‌నికి ఆయన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. త‌న అభిమానుల ప‌ట్ల ఇంత‌టి శ్ర‌ద్ధ చూపిస్తుండ‌డంతో వారు అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. త‌మ అల్లు అర్జున్‌.. అభిమాన హీరో.. నిజంగానే బంగారం.. అని కొనియాడుతున్నారు.

ఇక అల్లు అర్జున్ తాజాగా 40వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు. త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ఆయ‌న గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. అందుకు గాను ఆయ‌న సెర్బియా దేశానికి భార్య స్నేహారెడ్డి, పిల‌ల‌తో క‌లిసి వెళ్లారు. ఇక త్వ‌ర‌లోనే పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM