Allu Arjun : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా రిలీజ్ అయిన చిత్రం.. పుష్ప. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అయి సంచలన రికార్డులను సృష్టించింది. హిందీ మార్కెట్‌లో అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ క్రమంలోనే పుష్ప 2 కు భారీ డిమాండ్ ఏర్పడింది. పుష్ప సినిమా 2021 డిసెంబర్ 17న రిలీజ్ కాగా.. పుష్ప 2 ను 2022 డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని భావించారు. కానీ అది సాధ్యపడడం లేదు. కారణం.. పుష్ప 2 షూటింగ్ ఇంకా మొదలవనే లేదు. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే పుష్ప మొదటి పార్ట్‌కు బన్నీ రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. కానీ పుష్ప 2కు రెమ్యునరేషన్ వద్దని.. హిందీ హక్కులు కావాలని అడుగుతున్నారట. దీంతో నిర్మాతలు బన్నీతో చర్చలు జరుపుతున్నారట. గత కొద్ది రోజులుగా ఇదే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారట. అందుకనే షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెరపైకి ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే..

పుష్ప 2లో బన్నీ 50 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో కనిపించనున్నాడట. ఇప్పటి వరకు ఆయన ఇలాంటి ప్రయత్నం ఏ మూవీలోనూ చేయలేదు. దీంతో అల్లు అర్జున్ ఇలా చేస్తాడని అనుకోలేదని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కలవరపడుతున్నారు. ఇక పుష్ప 2లో బన్నీ ఇద్దరు పిల్లలు ఉన్న తండ్రి గెటప్‌లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.