Sukumar : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీ మార్కెట్‌లోనూ పుష్ప ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలోనే పుష్ప మూవీ వచ్చి చాలా రోజులు అవుతున్నా.. ఈ మూవీ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మూవీలోని డైలాగ్‌లను చెబుతూ.. పాటలకు డ్యాన్స్ లు చేస్తూ ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. సెలబ్రిటీలు సైతం పుష్ప డైలాగ్స్, పాటలకు ఫిదా అవుతున్నారు. అయితే పుష్ప 2వ పార్ట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉన్నా.. ఇంకా అది జరగలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీ విడుదల లేనట్లే అని చెప్పవచ్చు. అయితే దర్శకుడు సుకుమార్‌పై మాత్రం బన్నీ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో ఉన్నారు.
దర్శకుడు సుకుమార్ గతంలో ఇతర సినిమాలకు చెందిన ఈవెంట్లకు పెద్దగా హాజరు కాలేదు. కానీ ఈ మధ్య తరచూ ఇతర హీరోలకు చెందిన ఈవెంట్లలో పాల్గొంటున్నారు. సర్కారు వారి పాట, విరాట పర్వం ఇలా పిలిచిన ప్రతి ఈవెంట్‌కు వెళ్తున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. పుష్ప 2 షూటింగ్ ఈపాటికే ప్రారంభం కావల్సి ఉన్నా.. ఇంకా ఎందుకు ప్రారంభించలేదని.. దర్శకుడు సుకుమార్ ఈ మూవీని లైట్ తీసుకుంటున్నాడని.. త్వరగా పనులు పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించాలని.. ఇంత నిర్లక్ష్యం పనికిరాదని అంటున్నారు. అయితే సుకుమార్ మాత్రం తన పనితాను చేసుకుపోతున్నారు.
ఇక పుష్ప 2 ఆలస్యం అవుతుండడానికి సుకుమార్ కారణం కాదని.. అల్లు అర్జున్ రెమ్యునరేషనేనని తెలుస్తోంది. ఎందుకంటే మొదటి పార్ట్‌కు బన్నీ రూ.45 కోట్లు తీసుకున్నాడట. కానీ రెండో పార్ట్‌కు రెమ్యునరేషన్‌గా హిందీ హక్కులను అడుగుతున్నారట. అందువల్లే సినిమా నిర్మాతలు బన్నీతో చర్చిస్తున్నారట. కనుకనే పుష్ప 2 ఆలస్యం అవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏది ఏమైనా.. పుష్ప 2 మూవీ మాత్రం ఈ ఏడాదిలో విడుదల కాదని సులభంగా చెప్పవచ్చు. ఇప్పటికప్పుడు షూటింగ్ మొదలు పెట్టినా కనీసం ఏడాది పడుతుంది. అంటే.. వచ్చే ఏడాది వేసవిలోనే పుష్ప 2 వస్తుందని భావించవచ్చు. మరి అప్పటి వరకు అయినా మూవీ రిలీజ్ అవుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…