Allu Arjun : పుష్ప సినిమా సక్సెస్ అనంతరం అల్లు అర్జున్ గత 16 రోజుల నుంచి విదేశాల్లో గడిపి తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన విషయం విదితమే. ఇటీవలే దుబాయ్ లో గడిపిన అల్లు అర్జున్ ఎట్టకేలకు వెకేషన్ ముగించుకుని నగరానికి చేరుకున్నాడు. అయితే ఆయనకు ఇంట్లో కుమార్తె అర్హ ఘన స్వాగతం పలికింది.
వెల్‌కమ్ నాన్న.. అని గుమ్మంలో పువ్వుల రెక్కలతో రాసిన అర్హ తన తండ్రి అల్లు అర్జున్‌కు స్వాగతం పలికింది. దీంతో అల్లు అర్జున్ ఉప్పొంగిపోయాడు. అల్లు అర్జున్‌కు ఒక కుమారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
త్వరలో పుష్ప రెండో పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా గడిపేందుకు వెకేషన్‌కు వెళ్లాడు. మొత్తం 16 రోజుల పాటు వివిధ దేశాల్లో అల్లు అర్జున్ గడిపాడు. ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు.