Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు మల్టీప్లెక్స్ లను ఏర్పాటు చేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటికే ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏఎంబీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు దారిలోనే విజయ్ దేవరకొండ కూడా ఏవీడీని మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేశాడు. అల్లు అర్జున్ కూడా ఏఏఏ పేరుతో మల్టీ ప్లెక్స్ స్టార్ట్ చేస్తున్నాడు.
ఏషియన్ సంస్థతో కలిసి మల్టీ ప్లెక్స్ ను నిర్మిస్తుండగా, దీనికి ఏఏఏ అంటూ పేరు కూడా పెట్టారు. ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ అనేది ఈ మల్టీప్లెక్స్ పేరు. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి అంటున్నారు. ప్రస్తుతం తుది దశకు పనులు చేరాయని, త్వరలోనే మల్టీప్లెక్స్ ను ప్రారంభిస్తారని అంటున్నారు. మల్టీప్లెక్స్ ను లగ్జరీయస్ డిజైన్ లతో నిర్మిస్తున్నారని తెలుస్తోంది.
ఈ థియేటర్‌లోని టెక్నాలజీ వండర్ పిల్లలను, పెద్లలను ఎంటర్‌టైన్ చేస్తుందట. లార్జ్ డిజిటల్ స్క్రీన్ మీద బన్నీ విజువల్ ఉంటుంది. దాని ముందు నిల్చున్నవారు ఏ హైట్ లో వుంటే ఆ హైట్ లోకి ఆ విజువల్ మారిపోతుంది. చిన్న పిల్లాడు ఉంటే ఆ సైజ్ లోకి, పెద్ద వాళ్లు ఉంటే పెద్ద సైజ్‌లోకి విజువల్ మారుతుంది.
పైగా ఆ డిజిటల్ స్క్రీన్ ముందు నిల్చున్నవారు ఎలా మూవ్ అయితే ఆ విజువల్ అలా మూవ్ అవుతుంది. ఎలా మాట్లాడితే అదే మాట్లాడుతుంది. దీనికి రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. మరి ఈ టెక్నాలజీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…