Allu Aravind : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు రాజమౌళి.తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ఇప్పటివరకు తన కెరియర్లో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వని ఏకైక డైరెక్టర్ గా పేరు పొందారు రాజమౌళి. తెలుగు ప్రఖ్యాతని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్న డైరెక్టర్‌గా పేరు ప్రఖ్యాతలు పొందిన జక్కన్న బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్లొ తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించారు.
తాజాగా రాజమౌళికి సంబంధించిన ఓ విషయం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇండస్ట్రీలో చాలా హీరోలతో సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి కేవలం అల్లు అర్జున్ తో మాత్రం ఎందుకు సినిమా తీయడం లేదు అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన మగధీర సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మగధీర సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాగా, ఆయన కొడుకుతో సినిమా చేసేందుకు రాజమౌళి ఆసక్తిగా లేడట. అదుకు కారణం అల్లు అరవింద్‌తో రాజమౌళికి విభేదాలు అని తెలుస్తుంది. మగధీర సినిమా రిలీజ్ చేసే టైంలో రాజమౌళి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిద్దాం అని చెప్పారట. కానీ అల్లు అరవింద్ మాత్రం ఈ విషయంలో అస్సలు ఒప్పుకోలేదట. దాంతో అప్పటినుండి వీరి మధ్య విభేదాలు తలెత్తాయట.

అప్పటి నుండి వీరిద్దరు మాట్లాడుకోలేదు అని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అలాంటి వార్తలు ఏమి రావడం లేదు. కానీ అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా ఎందుకు తీయడం లేదు అనే ప్రశ్న తలెత్తడంతో అల్లు అరవింద్ – రాజమౌళి మధ్య ఉన్న విభేదాలే కారణం అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇటీవలే ఈ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలయ్యింది. తాజాగా ఈ చిత్రంలోని పాటకు గోల్డెన్ అవార్డు కూడా దక్కింది. ఆస్కార్ బరిలో కూడా నిలబడింది.