Alia Bhatt : బాలీవుడ్ నటి ఆలియా భట్ ఈ మధ్య కాలంలో సౌత్ చిత్రాలపై దృష్టి సారించిన విషయం విదితమే. అందులో భాగంగానే ఆమె ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ తేజ్ పక్కన సీతగా నటించింది. అందులో ఆమె పాత్ర నిడివి కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలిసింది. అయినప్పటికీ ఆమె ఏకంగా రూ.5 కోట్ల మేర పారితోషికం తీసుకుందని సమాచారం.
ఇక త్వరలో ఎన్‌టీఆర్‌తో కొరటాల శివ చేయబోయే సినిమాలోనూ ఆలియాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. దీంతో ఈ భామ దక్షిణాదిపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతుంది. అయితే ఆమె హిందీలో నటించిన గంగూబాయి కతియవాడి సినిమా ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
గంగూబాయి కతియవాడి మూవీని ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఆమె నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ అప్పుడు విడుదల అవుతుంది కనుక తాను నటించిన ఒక సినిమానే ఇంకో సినిమాకు పోటీ అవుతుందని భావించిన చిత్ర యూనిట్ గంగూబాయిని ఫిబ్రవరికి వాయిదా వేయించారు.
అయితే ప్రస్తుతం గంగూబాయి సినిమాకు ఓటీటీ సంస్థల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. జీ5, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ సంస్థలు ఈ మూవీకి చక్కని ఆఫర్‌లను అందిస్తున్నాయట. దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మూవీని థియేటర్ల కన్నా ఓటీటీలో విడుదల చేస్తేనే బాగుంటుందని ఆలోచిస్తున్నదట. అందువల్ల ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…