Akira Nandan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు ఇంకా సరైన వయస్సు రాలేదు. అయినప్పటికీ తండ్రిని మించిన తనయుడు అనిపించుకంటున్నాడు. ఇటీవలే తన బర్త్ డే సందర్భంగా అకీరా నందన్ రక్తదానం చేసి ఎంతో మంది మనసులను గెలుచుకున్నాడు. ఇక తాజాగా మరోమారు శభాష్ అనిపించుకున్నాడు. అకీరా నందన్ తన తండ్రిలాగే అనేక కళల్లో ఇప్పటికే ప్రావీణ్యం సంపాదించాడు. వాటిల్లో పియానో వాయించడం కూడా ఒకటి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌ను అకీరా నందన్ పియానోపై అద్భుతంగా వాయించాడు.
సర్కారు వారి పాట మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలోని అన్ని పాటలు బాగున్నాయి. సమాజానికి మెసేజ్ ఇచ్చే మూవీ కావడంతో దీన్ని అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక ఈ మూవీలోని కళావతి పాటను ముందుగా రిలీజ్ చేశారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ పాటకు ఎంతో మంది ఇప్పటికే స్టెప్పులు వేయగా.. అకీరా నందన్ మాత్రం ఈ పాటను సంగీత వాయిద్యంపై వాయించాడు.

పియానోపై అకీరా నందన్ ఈ పాటను వాయిస్తుంటే.. ఎంతో అద్భుతంగా సంగీతం రావడం విశేషం. పియానోలో అకీరా నందన్ ఇంతటి ప్రావీణ్యం సంపాదించాడా.. అని పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వాయిద్యానికి చెందిన వీడియోను అతను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే అకీరా నందన్ టాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.
View this post on Instagram