Akhil Akkineni : అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్‌కి మంచి టాలెంట్ ఉన్నా కూడా సినిమాలలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు. తొలిసారిగా అఖిల్ పేరుతోనే సినిమా చేశాడు. ఈ మూవీ సక్సెస్ సాధించలేకపోయింది. తర్వాత హలో అంటూ పలకరించాడు. అది బెడిసి కొట్టింది. ఇక మిస్టర్ మజ్ను చిత్రంతో పలకరించినా కూడా ఫలితం లేదు. ఇప్పుడు తన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం అఖిల్ తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన మొబైల్ వాల్‌పేపర్‌పై ఉన్న ఓ ఫొటోను రివీల్ చేశాడు. వాల్‌పేపర్ మీద ఉన్న తన తాత, లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు ఫొటోను రివీల్ చేశాడు. ఈ సందర్భంగా అఖిల్.. “నేను నా ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించే ఫొటో ఇదే. పదేళ్ల నుంచి ఇదే ఫొటోను చూస్తున్నాను. మా తాతగారికి సంబంధించి నాకు ఇష్టమైన స్టిల్ ఇది అని అన్నాడు.
నిజానికి ఇది సినిమాలో స్టిల్ కాదు, తాతయ్యను ఆడిషన్ చేసినప్పుడు లుక్ టెస్ట్ కోసం తీసిన ఫొటో ఇది. ఎందుకో బాగా నచ్చేసింది. పదేళ్ల నుంచి అలా ఉండిపోయింది. ఫోన్ మార్చినా కూడా నేను ఈ ఫొటో మార్చను అని తెలిపాడు. ఇక నాగార్జునకు ఉన్న మన్మథుడు ట్యాగ్ లైన్ పై స్పందిస్తూ.. ఏన్నేళ్లయినా అది తన తండ్రికే ఉంటుందని.. ఆ ట్యాగ్ లైన్ తనకు వద్దంటున్నాడు. కాగా.. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ అక్టోబర్ 15న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించాడు.