Akhil Akkineni : అక్కినేని వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవా చాటుతున్నాడు అఖిల్. అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన కొడుకు ఫస్ట్ సినిమా గ్రాండ్ గా ఉండాలనే కారణంతో నాగార్జున చాలా జాగ్రత్తగా వ్యవహరించారు కానీ ఫస్ట్ సినిమానే బెడిసికొట్టడంతో అఖిల్ ఖంగుతిన్నాడు. కమర్షియల్ హిట్ కొడతాడని అఖిల్ అనుకుంటే వినాయక్ డైరెక్షన్ లో అది కాస్తా వెనక్కు వెళ్ళింది. ఈ సినిమాకి హీరో నితిన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. ఆ తర్వాత నాగార్జున సొంత బ్యానర్ లో విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో హలో అనే సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమా ఫీల్ గుడ్ గా ఉన్నా.. కమర్షియల్ గా మాత్రం ఎదగలేకపోయింది. నెక్ట్స్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మజ్ను కాన్సెప్ట్ కూడా అదే రేంజ్ లో ఉంది. గీతా బ్యానర్ లో అఖిల్ తో ఓ హిట్ కొట్టించాలని గట్టిగా అనుకున్నట్లు ఉన్నారు. అలా అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయ్యింది. ఈ సినిమాలో మరో హైలెట్ హీరోయిన్ పూజా హెగ్దే. ఇంత కష్టపడి హిట్ కొట్టినా.. సంతృప్తి లేకుండా పోయింది.
ఎందుకంటే ఈ సినిమా హిట్ కొట్టినా ఆ క్రెడిట్ ని గీతా ప్రొడక్షన్స్ కి, హీరోయిన్ పూజా హెగ్దేకి, బొమ్మరిల్లు భాస్కర్ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. అందుకే అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయినా క్రెడిట్ మాత్రం రాలేదు. అఖిల్ నెక్ట్స్ సినిమా ఏజెంట్. ఈ సినిమా హిట్ అయితే అఖిల్ వల్లే సినిమా హిట్ అయ్యిందనే టాక్ ని సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాలి. ఏజెంట్ సినిమాకు మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. అలాగే స్పై (గూఢచారి) పాత్రలో అఖిల్ నటిస్తున్నాడు.