Akhanda Pre Release Event : అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ రంగానికి అండగా నిలవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా.. దాదాపుగా రెండేళ్ల పాటు టాలీవుడ్ ఇబ్బందుల్లో పడిందని.. ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు వస్తున్నాయని చెప్పిన బాలయ్య.. అందరు హీరోల సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నారు. ప్రభుత్వాల అండతో.. సినీ రంగం కోలుకోవాలని అన్నారు.
స్పీచ్ మొదట్లో తనకు అలవాటైన రీతిలో శ్లోకాలు, బీజాక్షరాలు, నవ విధాన పూజలను అలవోకగా పఠించారు. ఈ క్రమంలో తనపై తానే జోక్ విసురుకున్నారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో షో చేస్తున్నానని, ఇదే విధంగా భవిష్యత్తులో ఓ భక్తి చానల్‌లో ప్రవచనాల తరహాలో ఓ షో చేస్తానని చమత్కరించారు. ఒక్కో మాట కలిస్తే అక్షరం అవుతుంది. అక్షరాలు కలిస్తే మంత్రం అవుతుంది. మంత్రాల ఔన్నత్యాన్ని, నవ పూజల విశిష్టతను చాటిచెప్పే చిత్రమిది. భక్తితత్వాన్ని ఎన్నో సినిమాలతో నాన్నగారు బతికించారు. ఆ పంథాను నమ్మి నేను చేసిన సినిమా ఇది.
నాన్న ఎన్టీఆర్‌ను నేను గురువుగా, దైవంగా భావిస్తా. ఆ తర్వాత నా అభిమానుల్ని ప్రేమిస్తాను. నా నుంచి ఏదీ ఆశించకుండా కష్టాల్లో నాకు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తున్నది అభిమానులే. జయాపజయాల దైవాధీనాలు. విజయాలను చూసి గర్వపడను. పరాజయాల్ని చూసి ఏ రోజూ కృంగిపోను.
కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఈ సినిమా చేశాం. ‘అఖండ’తోపాటు అల్లు అర్జున్ ‘పుష్ప’, రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలు విజయవంతం కావాలి. సినీ పరిశ్రమకు అండగా నిలవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నా’ అని బాలకృష్ణ తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…