Akhanda Pre Release Event : అఖండ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన అల్లు అర్జున్ తనదైన మాటలతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. ‘నందమూరి అభిమానులకు, నా అభిమానులకు అందరికీ అభినందనలనీ అన్నారు. నందమూరి, అల్లు ఫ్యామిలీకు ఉన్న బంధం ఇప్పటిది కాదనీ, ఈ నాటి ఈ బంధం ఏనాటిదో.. అని చెప్పుకొచ్చారు. మా తాత గారు నేరుగా ఎన్టీఆర్ వంటింటికి వెళ్లేవారని, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగామని, అలాంటి వారి సినిమాలకు నేను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందనీ.. అన్నారు.
బోయపాటితో నేను భద్ర సినిమా చేయాలి.. కానీ అప్పుడు ఆర్య సినిమా కోసం వెళ్లాను.. అప్పుడే బోయపాటి గారు పెద్ద దర్శకుడు అవుతారని నాకు నమ్మకం ఉందని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్.. అక్కడి నుంచి స్టార్ డైరెక్టర్ వరకు ఎదిగారన్న బన్నీ, మీ జర్నీ చూశాను.. మనతో స్టార్ట్ అయిన వ్యక్తి ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. తమన్ మామూలు ఫాంలో లేడు.. పట్టుకుందల్లా బంగారం.. కొట్టిందల్లా సిక్సర్ అవుతోంది అని బన్నీ చెప్పుకొచ్చారు. ఇకపై కొత్త శ్రీకాంత్‌ను చూడాలని కోరుకుంటున్నానని బన్నీ అన్నారు.
ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు పేరుపేరునా ఆల్ ది బెస్ట్ చెప్పిన బన్నీ బాలకృష్ణ గారికి ఈ లెవెల్లో ఫ్యాన్స్ బేస్ ఉండటానికి రెండు కారణాలు. ఒకటి.. ఆయనకు సినిమా మీదున్న ప్యాషన్. రెండోది ఆయన వాచకం.. ఆయనలా డైలాగ్ చెప్పేవారు ఎవ్వరూ లేరని చెప్పుకొచ్చారు. రెండు మూడు పెజీల డైలాగ్స్ చెప్పినా అదే ఇంటెన్సిటీ ఉంటుందనీ, ఈ డిక్షన్ అనేది మహానుభావులు ఎన్టీఆర్ గారి వల్లే కుదిరింది. ఆ తరువాత కేవలం బాలయ్య గారే చెప్పగలరన్నారు. రీల్‌లో అయినా రియల్‌లో అయినా.. ఆయన రియల్‌గానే ఉంటారు. కోపం వస్తే కోపం.. ప్రేమ వస్తే ప్రేమ.. ఎప్పుడూ రియల్‌గానే ఉంటారని అన్నారు. మనం అనుకున్నది చేయగలగడం, అనుకున్నట్టు ఉండటం చాలా కష్టం, కానీ బాలయ్య గారు అలా ఉంటారు. నాకు పర్సనల్‌గా ఆయనలో ఇష్టమైంది అదేనని అన్నారు.
అఖండ సినిమా అఖండ జ్యోతిలా తెలుగు సినిమాకు వెలుగునివ్వాలని అందరం కోరుకుటున్నామన్న బన్నీ ఈ ఉత్సాహాన్ని ఇలానే కొనసాగిస్తూ.. మరో రెండు వారాల్లో రాబోతున్న పుష్ప, ఆ తరువాత రాబోతున్న ఆర్ఆర్ఆర్.. అలా ముందుకు వెళ్లాలి.. ఇండస్ట్రీ గెలవాలని ఆకాంక్షించారు. ఇక కోవిడ్ వచ్చినా.. పైనుంచి దేవుడు వచ్చినా.. తెలుగు ప్రేక్షకులు.. సినిమా తగ్గేదేలే.. మీ అందరి కోసం జై బాలయ్య.. అంటూ ఉత్సాహపరిచారు బన్నీ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…