Akhanda : నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ క్రమంలోనే అఖండ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, పోస్టర్లను చూస్తుంటే మాత్రం అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన భం.. భం.. అఖండ అనే పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్ లతో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.