Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంత పలు మూవీలకు వెంట వెంటనే సైన్ చేసింది. పిల్లలను కనాలని ప్లానింగ్ చేసుకుంది కానీ.. ఎక్కడో బెడిసికొట్టింది. దీంతో గతంలో నో చెప్పిన మూవీలకు కూడా ఇప్పుడు సమంత యెస్ అని చెబుతోంది. అందులో భాగంగానే ఆమె అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. విడాకుల ఒత్తిడి నుంచి వీలైనంత త్వరగా బయట పడాలని ఆలోచిస్తోంది.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత తెలుగులో మరో వెబ్‌సిరీస్‌లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఆ సిరీస్‌లో ఎల్‌టీటీఈ మెంబర్‌గా అదిరిపోయే విధంగా నటించింది. అంతేకాదు.. ఆ సిరీస్‌లో ఆమె పలు బోల్డ్ సన్నివేశాల్లోనూ నటించి అలరించింది.
అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఆమెకు ఎంత పేరు తెచ్చిందో అంతే నష్టం కూడా చేసింది. సగం ఆ సిరీస్ వల్లే అక్కినేని ఫ్యామిలీ గుర్రుగా ఉన్నారని, అందుకనే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఒక రూమర్ ఇప్పటికీ వినిపిస్తోంది. అయితే అదంతా గతం. ఆమె విడాకులు తీసుకున్నాననే ఫీలింగ్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. దీంతో సినిమాలతో బిజీ కావాలని ఆమె ఆలోచిస్తోంది. దీని వల్ల మానసికంగా కొంచెం రిలీఫ్ పొందవచ్చని ఆమె భావన.
ఇక తాజా సమాచారం ప్రకారం ఆమె ఆహా సంస్థ త్వరలో రూపొందించనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుందని తెలుస్తోంది. అందుకు ఆమె ఓకే కూడా చెప్పిందట. ఆహా మేనేజ్‌మెంట్ ఓ అద్బుతమైన సిరీస్ తీస్తున్నారని, అందులో సమంతను మెయిన్ రోల్‌లో చేయాలని అడిగారట. అయితే ఆమె ఓకే చెప్పిందా, లేదా.. తెలియదు కానీ.. ఆమెకు ఈ సిరీస్‌లో నటిస్తే భారీ ఎత్తున రెమ్యునరేషన్ ఇస్తామని కూడా ఆఫర్ చేశారట. దీంతో కష్టకాలంలో సమంతకు బంపర్ ఆఫర్ వచ్చినట్లయింది. మరి ఆమె దీనికి టెంప్ట్ అయి ఈ సిరీస్‌లో చేస్తుందా ? ఆహాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? అన్నది చూడాలి. ఇక సమంత రీసెంట్‌గా రెండు తెలుగు-తమిళ్ బైలింగువల్ ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…