Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన మంచు విష్ణు తాజాగా అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన మంచు విష్ణు ‘మా’ ఎన్నికలతో పాటు మెగా కుటుంబంతో ఉన్న రిలేషన్‌షిప్‌పై కూడా స్పందించాడు. ఈ క్రమంలో బన్నీ తనకు మంచి మిత్రుడని, తరచూ ఇద్దరం చాటింగ్ చేసుకుంటామని అన్నారు.
అలాగే అల్లు అర్జున్ అంటే అసూయ కలిగిందని, కానీ అతడిని చూసి గర్వంగా కూడా ఫీలయ్యానని అన్నారు మంచు విష్ణు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ మూవీ డిసెంబర్25న విడుదల కానుందని ముందుగా ప్రకటించారు. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ కూడా విడుదలకు సిద్దమైంది. దీంతో బాలీవుడ్‌కు చెందిన పలు మ్యాగజైన్స్, వార్త పత్రికలు తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్, అమీర్ ఖాన్‌కు పోటీ ఇవ్వబోతున్నాడని రాశాయి.
ఈ వార్తలు చూసి నేను కాస్త జలస్ ఫీలయ్యాను. అదే సమయంలో ఓ తెలుగు హీరోగా తనని చూసి గర్వపడ్డాను. ఇదే విషయాన్ని బన్నీకి కూడా చెప్పాను. ‘బ్రదర్, నేను నిన్ను చూసి అసూయపడుతున్నాను.. కానీ మీమ్మల్ని చూసి గర్వపడుతున్నా’ అని మెసెజ్ చేశాను’’ అని చెప్పుకొచ్చారు. మన తెలుగోడి సత్తాను తెలియజేశాడు బన్నీఅంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు విష్ణు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…