Adivi Sesh Major Movie : కరోనా నేపథ్యంలో అనేక పెద్ద చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ అందరూ తమ చిత్రాలకు కొత్త రిలీజ్ డేట్స్‌ను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలకు విడుదల తేదీలను అనౌన్స్ చేశారు. ఇక తాజాగా అడివి శేష్ నటించిన మేజర్ చిత్రం కూడా వాయిదా పడగా.. ఈ చిత్రానికి కూడా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ మే27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాస్తవానికి మేజర్ సినిమా ఈ మూమెంట్‌లో రిలీజ్ కావల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. అయితే ఆశ్చర్యకరంగా సినిమా విడుదల తేదీని చాలా రోజుల వ్యవధితో ప్రకటించారు. అప్పటి వరకు చాలా సమయం ఉంది. అన్ని రోజుల గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాని విషయం. ఈ మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ చాలా గ్యాప్ తీసుకుని ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ మేజర్ మూవీని తెరకెక్కించారు. దీనికి శశి కిరణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు హిందీ, మళయాళం భాషల్లోనూ ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో అడివి శేష్‌కు అపోజిట్‌గా సాయి మంజ్రేకర్ కీలకపాత్రలో నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో శోభిత ధూళిపాళ నటించింది.