Adipurush : ఓమ్ రౌత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో.. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రం.. ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. సీతగా కృతి సనన్, విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి చెందిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో లీకైంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఆది పురుష్ సినిమాకు గాను ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేశారు. దర్శకుడు ఓమ్ రౌత్ దగ్గరుండి గ్రాఫిక్స్ పనులు చూసుకుంటున్నారు. తానాజీ సినిమాలో తీసిన విధంగానే ఆది పురుష్‌ను కూడా పూర్తిగా ఇండోర్స్‌లోనే గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించారు. దీంతో ఇందులో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. సినిమాలో చాలా వరకు గ్రాఫిక్స్ ఉండనున్నాయి.
కాగా ఆదిపురుష్ సినిమాలోని ఓ సీన్ లీకైంది. అయితే అది ఒరిజినల్ సినిమాలోదా.. లేక ఎవరైనా సృష్టించి వదిలారా.. అన్నది సంగతి తెలియదు. కానీ ఫ్యాన్స్ దాన్ని వైరల్ చేస్తున్నారు. అసలే రాధే శ్యామ్ సినిమా వాయిదా పడడంతో ఫ్యాన్స్ కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఈ వార్త వారికి సంతోషాన్నిస్తోంది. అది ఫ్యాన్ మేడ్ లేదా లీకైన వీడియో.. ఏదైనా కావచ్చు.. ఏదో ఒక అప్‌డేట్ అయితే వచ్చిందని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఆదిపురుష్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ కథ యూనివర్సల్ కనుక.. రాముడు అంటే ప్రపంచంలో చాలా మంది తెలుసు కనుక.. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయ స్టార్‌గా మారుతాడని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…