Adi Purush : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ కు జోడీగా సీతమ్మ పాత్రలో తన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసుకున్న సందర్భంలో తన టీమ్ తో కలిసి కృతి సనన్ కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రాముడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా పౌరాణిక మాగ్నమ్ ఓపస్ లో తెరకెక్కిస్తుండగా.. కృతి సనన్ సీతాదేవిగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ డెమోన్ కింగ్ లంకేష్ గా అంటే రావణాసురుడిగా నటిస్తున్నారు.
సన్నీ సింగ్ ఈ మూవీలో లక్ష్మణుడి పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
.@kritisanon wraps up her part of shoot as "JANAKI" in #Adipurush 🔥#Prabhas @omraut #BhushanKumar #SaifAliKhan #KritiSanon @vfxwaala @rajeshnair06 @TSeries @RETROPHILES1 pic.twitter.com/xYpad9QPnz
— BA Raju's Team (@baraju_SuperHit) October 16, 2021