Adah Sharma : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అదా శర్మ. ఈ సినిమాతో ఆశించినంత ఫలితం అందలేదనే చెప్పాలి. హార్ట్ఎటాక్ సినిమా తర్వాత ఈమె పలు సినిమాలలో కూడా నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదులి. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైన అదాశర్మ ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా ఉంది.

అయితే సినిమా అవకాశాలు లేనప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటుంది. పొట్టి దుస్తులు ధరించి కుర్రకారుకు కావలసినంత వినోదాన్ని అందిస్తోంది. సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా పై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామరస్ ఫోటోల ద్వారా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఇక సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎన్నో గ్లామరస్ ఫోటోలను షేర్ చేసిన అదా శర్మ తాజాగా మరొక ఫోటోని షేర్ చేసింది. బెడ్ పై మోకాళ్ళపై కూర్చొని ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఈ విధంగా బెడ్ పై ఉన్న అదాశర్మ జీన్స్ ధరించి, టాప్ ను భుజాల వరకు తీసేసి అలాగే నడుము అందాలు కనపడేలా టాప్ ను పైకి ఎత్తుతూ మతులు పోగొట్టేలా ఫొటోను దిగింది. ప్రస్తుతం అదా శర్మ షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.