Chiranjeevi : టాలీవుడ్ లో హీరో ఎప్పుడూ హీరోగానే ఉంటాడు. ఆరు పదుల వయస్సు వచ్చినా సరే.. తగ్గేదేలే అంటూ హీరోగానే కొనసాగుతాడు. ఇప్పుడు కొంత మార్పు వచ్చి విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పటికీ ఫాదర్ క్యారెక్టర్ లు మాత్రం అస్సలు చేయరు. కానీ హీరోయిన్లకు మాత్రం ఆ అవకాశం ఉండదు. మూడు పదుల వయసు దాటితే చాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే.. అదృష్టం బాగుంటే ఇంకో 5 సంవత్సరాలు హీరోయిన్ లుగా నటిస్తుంటారు. కానీ ఆ తరవాత మాత్రం అక్క, వదిన పాత్రలకు షిఫ్ట్ అవ్వాల్సిందే.. అంతే కాకుండా అవసరమైతే తల్లి పాత్రలు అయినా వేయక తప్పుదు. ఇక కొంతమంది హీరోయిన్ లు అయితే తాము ఆడిపాడిన హీరోలకే తల్లిగా చేసే అవకాశాలు కూడా వస్తాయి.
అలా మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన ఇద్దరు హీరోయిన్ లు ఆయనకు తల్లిగా నటించారు. ఆ ఇద్దరు హీరోయిన్ లు ఎవరు.. వారు తల్లిగా చేసిన సినిమాలేవి అనేది చూద్దాం.. 1979లో జయసుధ, చిరంజీవి కాంబినేషన్ లో ఇది కథ కాదు అనే సినిమా వచ్చింది. ఈ చిత్రానికి బాల చందర్ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా మగధీరుడు సినిమాలోనూ చిరంజీవి జయసుధ హీరోహీరోయిన్ లు గా నటించారు. కానీ 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రిక్షావోడు సినిమా వచ్చింది. ఈ సినిమాలో జయసుధ చిరంజీవికి తల్లిగా నటించింది. దీంతో అంతా షాకయ్యారు.
ఇదిలా ఉంటే 1980లో వచ్చిన ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవి సుజాత హీరో, హీరోయిన్ లుగా కలిసి నటించారు. కానీ ఆ తరవాత సీతాదేవి సినిమాలో సుజాత చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించింది. ఇక అక్కడితో ఆగకుండా 1995లో మెగాస్టార్ హీరోగా బిగ్ బాస్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన రోజా హీరోయిన్ గా నటిస్తే.. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు తల్లి పాత్రలో సుజాత నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…