Manmadhudu : మన్మథుడు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ ఒక్క టైటిల్ కి పర్ఫెక్ట్ హీరో ఎవరంటే అందరి నుంచి వచ్చే సమాధానం నాగార్జుననే.. నాగ్ కి ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చినప్పటికీ మగువల దృష్టిలో మాత్రం నవ మన్మథుడే. ఇదే టైటిల్ తో 19 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే తానూ మన్మథుడు అని చూపించారు నాగ్.. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన నాలుగో సినిమానే మన్మథుడు. ఇప్పటికీ మన్మథుడు టీవీలో వస్తుంటే ఛానల్ మార్చకుండా చూస్తూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.
2002 డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాలోని కొన్ని ఇన్నర్ విషయాలను తెలుసుకుందాం. 2001వ సంవత్సరం నువ్వు నాకు నచ్చావ్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో త్రివిక్రమ్, భాస్కర్ లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎందుకంటే ఇది వారికి స్వయంవరం, నువ్వే కావాలి తర్వాత వచ్చిన మూడవ హిట్. దాంతో శ్రీను నెక్స్ట్ ఏమి సినిమా చేద్దాం అని విజయ్‌భాస్కర్ త్రివిక్రమ్‌తో అంటే.. త్రివిక్రమ్ వెంటనే నా దగ్గర రెండు కథలున్నాయి. కానీ నాకు కూడా దర్శకత్వం చేయాలని ఉంది భాస్కర్ అన్నారు. అందుకని ఏమి చేద్దాం నువ్వే చెప్పు అన్నారు త్రివిక్రమ్. దీనికి ఇంత ఆలోచించడం దేనికి నువ్వే నువ్వే కథను హీరో తరుణ్‌ని పెట్టి నువ్వే తియ్యి. రెండో కథని నేను ఎవరినైనా హీరోగా పెట్టి తీస్తాను. తరుణ్ అంటే ఆల్రెడీ నీ డైలాగులకు సింక్ అవుతాడు అన్నారు.
అంతేకాకుండా నువ్వు కొత్త కదా మిగతా అన్ని క్రాఫ్ట్స్‌లో కొత్తవాళ్ళని పెట్టుకో సరిపోతుంది అన్నారు విజయ్‌భాస్కర్. త్రివిక్రమ్‌కి కూడా తన సలహా నచ్చి సరే మరి నీ సంగతేంటి అన్నారు త్రివిక్రమ్. నాదేముంది ఇద్దరు ముగ్గురిని కలిసి కథ చెపుతాను నువు రాసిన కథ అంటే కచ్చితంగా ఒప్పుకుంటారు. త్రివిక్రమ్ కథను విజయ్‌భాస్కర్‌కి చెప్పి దీనికి టైటిల్ మన్మథుడు అని పెడితే బాగుంటుంది భాస్కర్ అన్నారు. ఇక కథ వింటున్నప్పుడే విజయ్‌భాస్కర్ చాలా ఎంజాయ్ చేశారు. మన్మథుడు అంటే మన టాలీవుడ్‌లో నాగార్జున మాత్రమే సరిపోతారు. కానీ దీనికి ఆయన ఒప్పుకుంటారో లేదో అన్నదే సందేహం అన్నారు భాస్కర్.
త్రివిక్రమ్ కథ చెప్పడం మొదలు పెట్టే ముందు నాగార్జునతో సినిమా టైటిల్ మన్మథుడు కానీ హీ హేట్స్ ఉమెన్ అన్నాడు. దాంతో నాగార్జున ఇదేంటి మన్మథుడు అని మళ్ళీ ఇలా అంటాడు అనుకొని.. కథ పూర్తిగా విన్నాక ఓకే బాగుంది చేద్దాం అన్నారు. వెంటనే భాస్కర్, త్రివిక్రమ్ ఆనందపడ్డారు. కానీ ప్రొడ్యూసర్ ఎవరని ఆలోచిస్తుంటే.. నాగార్జున ప్రొడ్యూసర్ గురించి వర్రీ అవ్వకండి నేనే ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. ఇక మన్మథుడు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.. ఆ తర్వాత మన్మథుడు 2 కూడా తీశారు కానీ ఆ సినిమా అట్టర్‌ఫ్లాప్ అయింది. మన్మథుడు చిత్రంలో ఎంత మంచి క్లీన్ కామెడీ ఉందో.. మన్మథుడు 2లో వల్గర్ కామెడీ పెట్టి అనవసరంగా సినిమా పరువు తీశారు అనిపిస్తుంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ చేశారు నెటిజన్స్.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…