Actress Hema : టాలీవుడ్ సీనియర్ మోస్ట్ నటి హేమ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతంలో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో శివ బాలాజీ చేయి కొరికి రచ్చ రచ్చ చేసింది. ఆ తరువాత మళ్లీ ఆ ఎన్నికలపై ఆమె మాట్లాడలేదు. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ఈమెకు సినిమాల్లో వరుస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అనేక సినిమాల్లో నటించి ఇప్పటికే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
అయితే తాజాగా నటి హేమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాల గురించి తెలియజేసింది. సినిమా వాళ్లు అంటే సహజంగానే ప్రజలకు లోకువ అని చెప్పింది. తాను కెరీర్‌లో ఎన్నో కష్టాలు పడ్డానని.. అందుకనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది.
ఇప్పుడు నటీనటులకు అన్ని సౌకర్యాలు ఉండేలా కారవాన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు ఈ సదుపాయాలు ఏవీ ఉండేవి కావు. దీంతో బట్టలు మార్చుకోవాలన్నా, టాయిలెట్స్‌కు వెళ్లాలన్నా.. ఇబ్బందిగా ఉండేది. ఇక ఓ సినిమా షూటింగ్ సమయంలో లంచ్ బ్రేక్ సందర్భంగా ఆ సినిమా డైరెక్టర్‌తో కలిసి భోజనం చేస్తున్నా. ఆ సమయంలో ప్రొడక్షన్ బాయ్ వచ్చి నువ్వు ఇక్కడ తినకూడదు.. అక్కడికెళ్లి భోజనం చెయ్యి.. అని అవమానించాడని తెలిపింది.
అయితే అతను అన్న మాటలకు తీవ్రమైన కోపం వచ్చిందని, అక్కడే ఉన్న టేబుల్‌ను ఎత్తి అతని మీద పడేద్దామనుకున్నానని.. కానీ శాంతించానని చెప్పింది. అయితే ఇలాంటి వాళ్లతో మాటలు పడడం ఎందుకు.. కష్టపడితే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటాం కదా.. అని చెప్పి ఈ రంగంలో ఎంతో శ్రమించానని.. ఈ స్థానం దక్కించుకున్నానని చెప్పింది. అయితే ఆ ప్రొడక్షన్ బాయ్ ఇప్పటికీ ఉన్నాడని, అతను మళ్లీ ఓ సినిమా షూటింగ్ సమయంలో తానే వచ్చి మర్యాదగా తనకు భోజనం పెట్టాడని చెప్పింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…